పాత సినిమా టైటిల్స్ తో హిట్లు కొట్టిన స్టార్ నాని - Natural Star Nani used Old film titles for his hit movies
నాని గా (Natural Star Nani) అందరికి తెలిసినా ఈ హీరో అసలు పేరు నవీన్ బాబు ఘంటా. రీసెంట్ గా వచ్చిన 25 వ సినిమా వి (Nani movie V) యావరేజ్ రేటింగ్ తెచ్చుకున్నా, నాని కెరీర్ లొ మంచి మంచి హిట్లు బాగానే ఉన్నాయి.
అష్ట చెమ్మా (Ashta Chemma)తో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి తర్వాత రాజమౌళి (Director SS Rajamouli) దర్శకత్వం లో నాని నటించిన ఈగ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఈగ కంటే ముందు హిట్లు వచ్చినా, ఈగ సినిమా నాని స్తాయి పెంచింది.
టాప్ హీరోస్ తో హిట్ సినిమాలు తీసిన ఈవివి | రీమేక్ డైరక్టర్ భీమనేని |
సింగీతం శ్రీనివాస రావ్ హిట్ సినిమాలు | పవన్ కళ్యాణ్ తో రెండో సినిమా అంటే |
నాని కెరీర్ లొ కొన్ని సినిమాలకు పాత సినిమా టైటిల్స్ పెట్టి మంచి హిట్ సంపాదించాడు.
పిల్ల జమీందార్: (Pilla Zamindar 2011 release)
Nani, Bindu Madhavi, hari priya , Rao Ramesh
Director G Ashok
2011 లో వచ్చిన ఈ సినిమా టైటిల్ ని 1980 లో సింగీతం శ్రీనివాస రావ్ గారు నాగెశ్వర రావ్ గారి తో తీసి హిట్ చేసారు. ఇదే టైటిల్ తో నాని 2011 లో తీసి హిట్ సదించాడు.
ఈ సినిమా లో నాని కి జంట గా బిందు మాధవి, హరి ప్రియ చేసారు. ఈ సినిమా హిట్ సాదించడమే కాకుండా విమర్సకుల ప్రసంసలు పొందింది.
ఈ సినిమా లో రావు రమేష్ పాత్ర అద్బుతమనే చెప్పాలి. ఈ సినిమా లో కామెడీ తో పాటూ అన్ని రసాలకి సమానమైన పీఠ వేశాడు దర్శకుడు అషోక్.
జెంటిల్మన్ : 2016 :
Gentlemen 2016 release
Nani, Nivetha Thomas, Surabhi
Srinivas Avasarala
Director - Indraganti Mohana Krishna
2016 లో వచ్చిన ఈ సినిమా టైటిల్ ని ఇదే టైటిల్ తో దర్శకుడు శంకర్ 1993 లో నే అర్జున్ తో సినిమా తీసి హిట్ సాదించాడు. ఈ టైటిల్ ని మళ్ళీ నాని తన సినిమా కోసం వాడి హిట్ కొట్టాడు.
ఇందులో నాని కి జంటగా నివేథా , సురభి నటించారు. ఈ సినిమాకి మణి శర్మ సంగీతం అందించగా, మొహన క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు.
మజ్ను : 2016:
Majnu 2016 release
Nani, Anu Emmanuel, Riya Suman
Director Virinchi Varma
ఇది పాత టైటిల్ తో వచ్చిన రెండవ సినిమా. 1987 లో దాసరి గారి దర్శకత్వం లో నాగర్జున హీరో గా మజ్ను అనే సినిమా వచ్చి హిట్ అయ్యింది. నాని కూడా తన సినిమా కి మజ్ను అనే పేరు పెట్టుకుని హిట్ సాదించాడు.
నాని నటించిన మజ్ను సినిమా కి విరించి వర్మ దర్శకత్వం వహించారు. ఇది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఈ సినిమా ద్వారా ఇద్దరు కొత్త హీరోయిన్లు తెలుగు తెర కి పరిచయం అయ్యారు.
ఒకరు రియా సుమన్ కాగా ఇంకొకరు అను ఇమ్మాన్యల్ . రియా సుమన్ కి పెద్దగా అవకాసాలు రాలేదు కాని అను ఇమ్మాన్యల్ కి మాత్రం బాగానే అవకాసాలు వచ్చాయి.
ఈ సినిమా నిర్మానానికి 16 కోట్లు ఖర్చు కాగా రిలీజ్ అయ్యాకా, థియేటర్ల లో 28.4 కోట్లు వసూలు చేసింది.
దేవదాస్:
Devadas
Nani, Nagarjuna, Akanksha Singh, Rashmika,
ఈ పేరు తెలీన వాళ్ళు ఊండరు. ఈ సినిమాను ముందుగా నాగేస్వర ఋఆవ్ చేయగా, తర్వాత క్రిష్న కూడా ఈ సినిమా పేరు ని వాడుకున్నారు.
2018 లో నాగార్జున, నాని ఇద్దరు హీరోలగా 2018 లో వచ్చిన మల్టీ స్తారర్ దేవదాస్ అనే పేరు తో రిలీజ్ అయ్యింది. కాని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకోలేక పోయింది. ఈ సినిమా లో నాగార్జున కి జంటగా ఆకాంక్ష, నాని కి జంటగా రష్మిక చేసారు.
నానీస్ గ్యాంగ్ లీడర్ :
Nanis Gang Leader:
Nani, Lakshmi
చిరంజ్వి హీరో గా వచ్చిన ఈ సినిమా టైటిల్ కూడా నాని తన సినిమాకు వాడుకున్నడు. 2019 లో వచ్చిన ఈ సినిమా కూడా హిట్ సాదించింది. 40 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 45 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో కార్తీకేయ నెగెటివ్ రోల్ చేసాడు.
ఈ సినిమాలే కాకుండా నానీ చాలా సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేసాడు.
Comments
Post a Comment