Skip to main content

పవన్ కళ్యాణ్ తో రెండో సినిమా తో తల బొప్పి కట్టించ్చుకున్న డైరక్టర్లు - Second chance is dangerous with Pawan Kalyan

పవన్ కళ్యాణ్ తో రెండో సారి సినిమాలు తీసిన దర్శకులు తల బొప్పి కొట్టించుకున్నారు. ఒక్క త్రివిక్రం మాత్రం రెండో సినిమా అత్తరింటికి దారేది హిట్ ఇచ్చి, మూడో సినిమా అజ్ఞాత వాసి ఫ్లాప్ ఇచ్చాడు. 

బద్రి తో హిట్ ఇచ్చిన పురి జగన్నాథ్, కెమేరామ్యాన్ గంగ తో రాంబాబు ఫ్లాప్ ఇచ్చాడు.
ఇలా కొంత మంది దర్శకులు


సుస్వాగతం: (Suswagatham)

1998 లొ రిలీజ్ అయిన  సుస్వాగతం తో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు భారి హిట్ ఇచ్చాడు భీమనేని శ్రీనివాస రావు (Bhimaneni Srinivasarao). ఆ సినిమా తో పవన్ కళ్యాన్ కు ఇండస్ట్రీ లొ ఒక గుర్తింపు వచ్చింది. ఆ సినిమా మ్యూజికల్ గా మంచి హిట్ సాదించింది .

Pawan Kalyan - Suswagatham



అన్నవరం: (Annavaram)

1998 లో ఇచ్చిన విజయం నమ్మకం తో,  2006 లో పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమనేని కి అవకాశం ఇచ్చారు. అదే అన్నవరం సినిమా.అప్పటికే ఫ్లాప్స్ తో సతమతమవుతున్న పవన్ కి ఇది కూడా ఫ్లాప్ గా మిగిలింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరీ కాంబినేషన్ లో ఇంక ఏ సినిమా రాలేదు .

Pawan Kalyan - Annavaram


తొలి ప్రేమ : 1998 రిలీజ్  (Tholi Prema)

పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీ లో ఒక మెట్టు ఎక్కించిన సినిమా తొలి ప్రేమ. కరునాకరన్  (Karunakaran) దర్శకత్వం లో వచ్చిన సినిమా  రికార్డ్ హిట్ అనే చెప్పాలి. ఈ సినిమా లో పవన్ కు జంటగా కీర్తి రెడ్డి నటించింది. ఈ సినిమా లో ని పాటలు రికార్డ్ స్తాయి లో హిట్ అయ్యాయి. 
ఈ సినిమా  National Film Award for Best Feature Film in Telugu గెలుచుకుంది .


Pawan Kalyan - Tholi Prema


 బాలు: 2005 రిలీజ్  (Balu - ABCDEFG - A Boy Can Do Everything For Girl)

కరునాకరన్ పైన నమ్మకం తో చేసిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక పెద్ద ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమా లో పవన్ కు జంటగా శ్రియా శరన్, నేహా ఒబెరాయ్ నటించారు. 

Pawan Kalyan - Balu


బద్రి: రిలీజ్ 2000  (Badri - Pavan Kalyan, Puri Jagannath)
 
పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వం లో వచ్చిన హిట్ చిత్రం బద్రి. పవన్ కళ్యాణ్ కి జంటగా అమీషా పటేల్, రేను దేశాయ్ నటించారు. ఈ సినిమా ఇండస్ట్రీ లొ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది మ్యూజికల్ గా కూడా హిట్ సాదించింది.

Pawan Kalyan - Badri


ఈ సినిమా లో పవన్, ప్రకాష్ రాజ్ మద్య వచ్చే పంచ్ డైలాగులు అద్బుతం అనే చెప్పాలి  .

కెమేరామ్యాన్ గంగ తో రాంబాబు 2012 రిలీజ్  (Camera Man Ganga to RamBabu)

ఈ సినిమా పవన్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా. ఈ సినిమా లో పవన్ కు జంటగా తమన్నా నటించింది.  బద్రి తర్వాత వచ్చిన ఈ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్ల లో అనుకున్నంత ఆదరణ లబించేదు.   

Pawan Kalyan - Cameraman Ganga to Rambabu

 
ఫ్యాన్స్ ఆదరించిన ఈ చిత్రం సగటు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఆ తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ లో ఏ సినిమా రాలేదు .

ఖుషి: 2001 రిలీజ్ (Khushi)

యెస్ జె సూర్యా  (S J Surya) దర్శకత్వం లో వచ్చిన మెగా హిట్ సినిమా ఖుషి. ఈ సినిమా లో ని పాటలు మెగా హిట్. ఈ సినిమా లో పవన్ కు జంటగా భూమిక నటించారు. ఈ సినిమా ద్వారా భూమికా కు ఫిల్మ్ ఫేర్ వారి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ వచ్చింది. తమిళ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాన్ కు ఒక మెగా హిట్ గా నిలించింది. 

Pavan Kalyan -Khushi


పులి 2010 రిలీజ్ (Puli)

యెస్ జె సూర్యా పైన నమ్మకం తో 2010 లో వచ్చిన సినిమా కొమరం పులి. ఇది ఇండస్ట్రీ ఒక డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ కు జంటగా నికితా పటేల్ నటించింది. 

Pavan Kalyan -Puli


రిలీజ్ అయినవెంటనే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 5 రోజుల తర్వాత రీ ఎడిట్ చేసి మళ్ళీ రిలీజ్ చేసారు నిర్మాత, అయినా పెద్దగా ఉపయోగ పడలేదు. 

Comments

Post a Comment