మోహన్ బాబు ఇప్పటికి సినిమా ఇండస్ట్రీ లో ఆయన ప్రస్థానం మొదలుపెట్టి 45 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆయన సినిమాల్లో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా నటించి ప్రేక్షకాదరణ పొందారు. 1975 లో స్వర్గం నరకం సినిమాలో దర్శక రత్న దాసరి నారాయణరావు గారు మోహన్ బాబు ను వెండి తెరకు పరిచయం చేశారు. సినిమాల్లో కి రాక ముందు ఆయన పేరు భక్త వత్సలం నాయుడు. ఒక స్కూల్లో డ్రిల్ టిచర్ గా పని చేస్తూ సినిమాల్లో అవకాశలకు ప్రయత్నం చేస్తుండగా, స్వర్గం నరకం సినిమాతో ఆయనకు అవకాశం వచ్చి అప్పటి నుండి ఒక విలక్షణ నటుడి గా వెలుగుతున్నారు. ఆ తరువాత ఆయన వెను తిరిగి చూసుకోలేదు. శివరంజని, గౄహ ప్రవేశం, పాలూ, నీళ్ళు, పట్నం వచ్చిన పతివ్రతలు వంటి హిట్ సినిమాలు చేసారు. ఆ తర్వాత అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, రొడీ గారి పెళ్ళాం, బ్రహ్మ, అల్లరి మొగుడు, సోగ్గాడి పెళ్ళాం, ఎం ధర్మ రాజు ఎం ఏ, డిటెక్టివ్ నారద, అల్లరి పోలీస్, మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న, అన్నమయ్య, యమ దొంగ వంటి హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఒకానొక సందర్బం లో వరుసగా ఆయన సినిమాలు హిట్ అవ్వడం తో ఆయనకు కలెక్షన్ కింగ్ అని పేరు కూడా వచ్చిం...
Latest update about Telugu movies. Telugu movie reviews. Telugu movie trailers. Movie event updates. Tollywood Stories and gossips. Tollywood news.Telugu movie news. Telugu movie updates.