సినిమాల్లో కూడా సత్తా చాటిన బిగ్ బాస్ కంటెస్టంట్ గంగవ్వ - BiggBoss 4 Contestant Gangavva in Telugu hit movies
గంగవ్వ పేరు ఒక యూట్యూబ్ ఆర్టిస్ట్ గా చాలా మందికి తెలుసు కాని ఆమె ఇప్పటికే 2 హిట్ సినిమాలు చేసిన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. జీవితం లో గంగవ్వ ఎన్నో కష్టాలు పడి భర్త సహాయం లేకుండా పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు చేసింది. తర్వాత ఒక యూట్యూబ్ చానల్ లో యాక్టివ్ గా చేసేది. తను చేసిన యూట్యూబ్ స్కిట్ ల ద్వారా చాలా మంది అభిమానాన్ని సంపాదించింది గంగవ్వ. అలాంటి జర్నీ లో ఒక్క సారిగా గంగవ్వ కి సినిమా అవాకసం కూడా వచ్చింది. రాం (Ram) హీరో గా పూరీ జగన్నాథ్ (Director Puri Jagannath) దర్శకత్వం లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) లో ఒక సన్నివేశం లో కనిపిస్తుంది. హీరో రాం, పోలిస్ స్టేషన్ నుంచి తప్పించుకుని, ఒక ట్రాక్టర్ లో వేరే ఊరు వెల్తుండగా, అదే ట్రాక్టర్ లో గంగవ్వ కూడా ఉంటుంది. హీరో రాం ఫ్లాష్ బ్యాక్ అంతా గంగవ్వ కి చెపుతాడు. ఆ తర్వాత గంగవ్వ కి ఇంకొక సినిమా అవకాశం వచ్చింది. అదే మల్లేశం (Mallesam). ఒక సన్నివేశం లో హీరో ప్రియ దర్శి (Hero Priyadarsi) ఒక నాటకం వేస్తుంటే చూసే ప్రేక్షకుల్లో ఒకరి గా కూర్చుని ఉంటుంది. హఠాత్తుగా అక్కడికి పాము రావటం తో అందరు పరుగులు పెడతా...