ఈ తరం యువత కు అంతగా పరిచయం లేని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. (Singeetam Srinivasa Rao) ఈయన మెగాఫోను పట్టి చాలా సంవత్సరాలే అయ్యింది. ఈయన చివరగా దర్శకత్వం చేసిన సినిమా 2013 లో వెల్కం ఒబామా (Welcome Obama). ఈయన చేసిన సినిమాలలో చాలా వరకూ ప్రయోగాలే. ప్రయోగాత్మక సినిమాలన్నీ హిట్ సినిమాలే. 1972 లో నీతీ నిజాయితీ అనే సినిమా తో దర్శకుడు గా పరిచయం అయ్యి, తెలుగు, తమిళం, కన్నడ భాషలు అన్ని కలిపి 53 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన మాయబజార్ సినిమాకు సహాయ దర్శకుడు. 1987 లో పుష్పక విమానం (Pushpaka Vimanam) అనే సినిమాతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు సింగీతం. ఈ సినిమాలో డయాలగ్ అనేదే ఉండదు. ఇది మూకీ సినిమాగా ప్రఖ్యాతి గాంచింది. ఈ చిత్రానికి గానూ, సింగీతం గారికి ఉత్తమ దర్శకుడి గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ పొందారు. 1989 లో విచిత్ర సోదరులు (Vichitra Sodarulu) అనే సినిమా ద్వారా మరొక ప్రయోగం చేసారు.ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసారు, ఒక కమల్ హాసన్ (Kamal Hasan) మాములుగా ఉండి, ఇంకొక కమల్ హాసన్ మరుగుజ్జుగా చూపించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో కెమేరా ట్రిక్స్ తో కమల్ హాసన్ ను మరుగుజ్
Latest update about Telugu movies. Telugu movie reviews. Telugu movie trailers. Movie event updates. Tollywood Stories and gossips. Tollywood news.Telugu movie news. Telugu movie updates.