ఈ తరం యువత కు అంతగా పరిచయం లేని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. (Singeetam Srinivasa Rao) ఈయన మెగాఫోను పట్టి చాలా సంవత్సరాలే అయ్యింది. ఈయన చివరగా దర్శకత్వం చేసిన సినిమా 2013 లో వెల్కం ఒబామా (Welcome Obama).
ఈయన చేసిన సినిమాలలో చాలా వరకూ ప్రయోగాలే. ప్రయోగాత్మక సినిమాలన్నీ హిట్ సినిమాలే. 1972 లో నీతీ నిజాయితీ అనే సినిమా తో దర్శకుడు గా పరిచయం అయ్యి, తెలుగు, తమిళం, కన్నడ భాషలు అన్ని కలిపి 53 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన మాయబజార్ సినిమాకు సహాయ దర్శకుడు.
1987 లో పుష్పక విమానం (Pushpaka Vimanam) అనే సినిమాతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు సింగీతం. ఈ సినిమాలో డయాలగ్ అనేదే ఉండదు. ఇది మూకీ సినిమాగా ప్రఖ్యాతి గాంచింది. ఈ చిత్రానికి గానూ, సింగీతం గారికి ఉత్తమ దర్శకుడి గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ పొందారు.
1989 లో విచిత్ర సోదరులు (Vichitra Sodarulu) అనే సినిమా ద్వారా మరొక ప్రయోగం చేసారు.ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసారు, ఒక కమల్ హాసన్ (Kamal Hasan) మాములుగా ఉండి, ఇంకొక కమల్ హాసన్ మరుగుజ్జుగా చూపించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో కెమేరా ట్రిక్స్ తో కమల్ హాసన్ ను మరుగుజ్జు గా చూపించడం ద్వారా విమర్శకుల ప్రశంసలు పొండారు.
1990 లో కమల్ హాసన్ తోనే మరొక ప్రయోగం చేసారు. మామూలుగా ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభ్నయం సినిమాలు చూసాం. 1990 లో వచ్చిన మైకెల్ మదన కామరాజు (Michael Madana Kama Raju) సినిమా ద్వారా హీరో కమల్ హాసన్ చతుర్ పాత్రాభినయం చేసారు. ఈ ఘనత సింగీతం దే. సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం లో నలుగురు కమల్ హాసన్లు ఒక చోట ఉండే విధానాన్ని, సింగీతం అద్భుతంగా చూపించారు.
1991 లో మరొక ప్రయోగం చేసారు. ఆదిత్య 369 అనే సినిమా ద్వారా ఒక మనిషి టైం మెషిన్ ద్వారా గతం లోకీ, భవిష్యత్తు లోకీ వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచన తో ఈ సినిమా తీసారు. బాలక్రిష్న (Balakrishna) ఈ సినిమాలో హీరో గా చేసారు.
1994 లో భైరవ ద్వీపం (Bhairava Dweepam) అనే సినిమా ద్వారా మరొక ప్రయోగంచేసారు. సాంఘిక చిత్రాలు, కమర్షియల్ చిత్రాలతో సినిమా పరుగులు పెడుతున్నా ఆ రోజుల్లో, పాత రోజులు గుర్తు చేస్తూ జానపద చిత్రం తీసారు.
1993 లో స్పీల్ బెర్గ్ తీసిన జురాసిక్ పార్క్ గ్రాఫిక్స్ తో ప్రపంచం యావత్తు, విస్మయం చెందితే, 1994 లో సింగీతం తన జానపద చిత్రం లో అద్భుతమయిన గ్రాఫిక్స్ తో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు.
ఈ ప్రయత్నాలలో గమనిస్తే, కమల్ హాసన్, బాలక్రిష్న హీరోలు గా చేసారు.
Comments
Post a Comment