సింగీతం శ్రీనివాసరావు, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు - Magical combination of Singeetham Srinivasa Rao and Kamal Haasan
1979 లో మొదటి సారిగా వీరి కాంబినేషన్ లొ సొమ్మొకడిది సోకొకడిది సినిమా వచింది. అది సూపర్ హిట్ అవ్వటం తో వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలే వచ్చాయి. వాటి వివరాలు ఇవిగో ఇక్కడ
సొమ్మొకడిది సోకొకడిది (1979 రిలీజ్) (Sommokadidi Sokokadidi 1978 release)
Cast - Kamal Haasan, Jayasudha, Roja Ramani
Director Singeetham Srinivasa Rao
కమల్ హాసన్ తెలుగు లో చేసిన మొదటి డబల్ రోల్ చిత్రం ఇది. సినిమా ఆద్యంతం హాస్యం తో మిళితమై ఉంటుంది. ఇది సింగీతం , కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి మ్యాజికల్ సినిమా. ఈ సినిమా లో కమల్ హాసన్ కు జంటగా జయసుధ, రోజా రమణి నటించారు. ఈ సినిమా లో పాటలు కూడా సూపర్ హిట్. ఈ సినిమా కు సంగీతం అందించినది రాజన్ నాగేంద్ర .
అమావస్య చంద్రుడు: 1981 రిలీజ్ (Amavasya Chandrudu)
Cast - Kamal Haasan, Madhavi, Kantha Rao
Director Singeetham Srinivasa Rao
ఇది కమల్ హాసన్, సింగీతం కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం.అప్పత్లో నే హీరో ను అందుడి గా చూపించిన చిత్రం .
ఈ సినిమా కి కథ కమల్ హాసన్ అందించారు, దానితో పాటు ఆయన నిర్మాత గా కూడా వ్యవహరించారు.
ఇది నటుడి గా కమల్ హాసన్ కు 100 వ చిత్రం, నిర్మాత గా మొదటి చిత్రం. ఈ సినిమా ద్వారా కమల్ హాసన్ కు ఫిల్మ్ ఫేర్ వారి ఉత్తమ నటుడి అవార్డ్ కూదా గెలుచుకున్నారు.
కాని బాక్స్ ఆఫీస్ దగ్గ ఈ సినిమా వసూళ్ళు రాబట్టలేక పోయింది. ఈ సినిమా ద్వారా కమల్ హాసన్ కు విమర్శకుల ప్రసంసలు అందినా ఆర్దికం గా బాగా నష్టపోయారు
పుష్పక విమానం: 1988 రిలీజ్ (Pushpaka Vimanam)
Cast - Kamal Haasan, Amala
Director Singeetham Srinivasa Rao
ఇది వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా. ఈ సినిమాలో అసలు మాటలు ఉండవు. మ్యూసిక్ ఉంటుంది కాని, డైలాగ్స్ ఉండవు .
ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ గా నిలిచింది. ఇది ఏ భాష వాళ్ళు చూసిన ఆనందించేలా రూపొందించారు.
పాత్రల ఎంపిక సింగీత కు సవాల్ ఒక గా నిలిచింది .
టిన్ను ఆనంద్ పాత్రకు ముందుగా అమ్రిష్ పురిని అనుకున్నారు కాని ఆయన డెట్స్ ఖాలి లేక పోవటం తో సారిక సలహా మేరకు టిన్ను ఆనంద్ ని ఎంపిక చేసుకున్నారు.
విచిత్ర సోదరులు 1989 రిలీజ్ (Vichitra Sodarulu)
Cast - Kamal Haasan,Gautami
Director Singeetham Srinivasa Rao
ఇది వీరికాంబినేషన్ లో వచ్చిన 4 వ సినిమా. ఈ సినిమా ఒక ప్రయోగాత్మక చిత్రం అనే చెప్పాలి.
ఈ సినిమా చేసిన హీరో కమల్ హాసన్, దర్శకుడు సింగీతం ధైర్యాన్ని కొనియాడాలసిందే.
ఈ సినిమా లో కూడా కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేసారు. ఒక కమల్ హాసన్ మాత్రం మరుగుజ్జు గా తెర పై కనిపిస్తారు.
ఆ సీన్స్ ఎలా తీసారో ఆ టెక్నిక్ ఏమిటో చాలా రోజులు చెప్పలేదు .
ఈ సినిమాకు కమల్ హాసన్ నిర్మాత గా వ్యవహరించారు.
ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. తమిళనాడు లో కొన్ని థియేటర్లలో 200 రోజులు ప్రదర్శింపబడింది
ఈ సినిమా తమిళనాడు వారి ఉత్తమ చిత్రం అవార్డ్ ను కూడా గెలుచుకుంది
ఈ సినిమా ఇప్పటికి బోర్ కొట్టదు. చాలా సరదా గా ఉంటుంది.
మైకల్ మదన్ కామరాజు 1990 రిలీజ్ (Micheal, Madan Kamaraju)
Cast - Kamal Haasan,Khushboo, Urvasi, Rupini
Director Singeetham Srinivasa Rao
ఇది ఇంకొక ప్రయోగాత్మక చిత్రం. ఈ సినిమాలో కమల్ హాసన్ 4 రోల్స్ వేసారు.
పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. ఈ సినిమా లో ఒక ప్రత్యేక పాత్ర లో మహాభారతం భీముడు నటించారు.
సినిమా ఆద్యంతం హాస్యం తో నిండి ఉంటుంది.
ఖుష్బూ , ఊర్వశి, కమల్ హాసన్ మద్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి .
సింగీతం ఈ సినిమా తీసిన విధానం ప్రేక్షకులని కట్టిపడేసాలా ఉంది
నవ్వండి లవ్వండి 1998 రిలీజ్ (Navvandi Lavvandi)
Cast - Kamal Haasan,Prabhu Deva, Soundarya, Rambha
Director Singeetham Srinivasa Rao
ఇది 1998 లో వచ్చిన ఇంకొక కాంబినేషన్ హిట్ సినిమా.
ఇందులో హీరోలుగా కమల్ హాసన్, ప్రభుదెవ నటించారు. వారికి జంటగా రంభ, సౌందర్య నటించారు. హిందీ లో వచ్చిన హౌస్ ఫుల్ సినిమా ఈ సినిమా కు ఫ్రీ మేక్ .
నవ్వండి లవ్వండి ఒక హాస్యభరిత చిత్రం.
ముంబాయ్ ఎక్స్ ప్రెస్: 2005రిలీజ్ (Mumbai Express)
Cast - Kamal Haasan,Prabhu Manisha Koyiraa
Director Singeetham Srinivasa Rao
ఇది వీరి కాంబినేషన్లో ప్రస్తుతానికి వచ్చిన ఆఖరి సినిమా. ఈంకా వీరిద్దరు కొథ సినిమా అనుకోలేదు.
ఇది కూడా హాస్య భరిత చిత్రం. కాని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.
ఈ సినిమా లో కమల్ హాసన్, మనీషా కోయిరాల నటించారు.
ఈ సినిమా కూడా ఆద్యంతం వినోదం తో నిండి ఉంటుంది.
ఈ సినిమా కి కూడా కమల్ హాసన్ నిర్మాతా గా వ్యవహరించారు.
Comments
Post a Comment