మోహన్ బాబు ఇప్పటికి సినిమా ఇండస్ట్రీ లో ఆయన ప్రస్థానం మొదలుపెట్టి 45 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
ఆయన సినిమాల్లో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా నటించి ప్రేక్షకాదరణ పొందారు.
1975 లో స్వర్గం నరకం సినిమాలో దర్శక రత్న దాసరి నారాయణరావు గారు మోహన్ బాబు ను వెండి తెరకు పరిచయం చేశారు.
సినిమాల్లో కి రాక ముందు ఆయన పేరు భక్త వత్సలం నాయుడు. ఒక స్కూల్లో డ్రిల్ టిచర్ గా పని చేస్తూ సినిమాల్లో అవకాశలకు ప్రయత్నం చేస్తుండగా, స్వర్గం నరకం సినిమాతో ఆయనకు అవకాశం వచ్చి అప్పటి నుండి ఒక విలక్షణ నటుడి గా వెలుగుతున్నారు.
ఆ తరువాత ఆయన వెను తిరిగి చూసుకోలేదు. శివరంజని, గౄహ ప్రవేశం, పాలూ, నీళ్ళు, పట్నం వచ్చిన పతివ్రతలు వంటి హిట్ సినిమాలు చేసారు.
ఆ తర్వాత
అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, రొడీ గారి పెళ్ళాం, బ్రహ్మ, అల్లరి మొగుడు, సోగ్గాడి పెళ్ళాం, ఎం ధర్మ రాజు ఎం ఏ, డిటెక్టివ్ నారద, అల్లరి పోలీస్, మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న, అన్నమయ్య, యమ దొంగ వంటి హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.
ఒకానొక సందర్బం లో వరుసగా ఆయన సినిమాలు హిట్ అవ్వడం తో ఆయనకు కలెక్షన్ కింగ్ అని పేరు కూడా వచ్చింది.
ఈ మధ్య ఒక డబ్బింగ్ తమిళ సినిమ ఆకశం నీ హద్దురా లో ఒక ప్రత్యేక పాత్ర చేసి, ఆయన అభిమానులని అలరించారు.
ఈయన డయలాగ్ డెలివరీ కి ఒకప్పటి నటుడు ఎంటీఆర్ కూడా ప్రశంసలు అందించారు.
ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలే కాకుండా, తిరుపతి కి దగ్గర్లో రంగం పేట అనే గ్రామం లో ఒక స్కూలు, ఇంజినీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజీ, డిగ్రీ కాలేజి స్తాపించారు.
నటుడి గా 45 ఏళ్ళూ పూర్తి చేసుకున్న ఆయనకు శుభాబివందనములు.
Comments
Post a Comment