భీమనేని (Bhimaneni Srinivasa Rao) అంటే రీమేక్ స్పెషలిస్ట్ అని ఇండస్ట్రీ లో పేరు. ఆయన తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులో రీమేక్ చేసిన ఘనత దక్కింది. ఆయన 13 సినిమాలు కు దర్శకత్వం చేస్తే అందులో 12 సినిమాలు రీమేక్లే. 
 
                                    
                                    
                                        
                                          
                            
దర్శకుడు  గా ప్రయాణం మొదలు పెట్టే ముందు  ఆయన టి క్రిష్ణ దగ్గర సహాయ దర్శకుడిగా చేసారు.
శుభమస్తు: (Subhamastu - Jagapathi Babu, Indraja, Aamani)
1995 లో శుభమస్తు సినిమా తో దర్శకుడి గా ఆయన ప్రయాణం మొదలయ్యింది. 
జగపతి బాబు, ఇంద్రజ, ఆమని నటించిన ఈ సినిమా మళయాలం మాత్రుక. ఈ సినిమా వెండి తెర పై పరవాలేదనిపించింది. 
శుభాకాంక్షలు: (Subhakankshalu - 1997 release)
Jagapathi Babu,Raasi, Ravali, Satyanarayana)
1997 లో వచ్చిన ఈ సినిమా తో భీమనేని రేంజ్ పెరిగిపోయింది. జగపతి బాబు, రవళి, రాశి నటించిన ఈ సినిమా తమిళ మాతౄక. ఈ సినిమా కథా పరం గా మ్యూసికల్ పరం గా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా లో కామెడీ టచ్ తో భీమనేని కామెడీ త్రాక్ బాగా నడపగలరని నిర్మాతలకు ఒక నమ్మకం కలిగింది.  
అప్పట్లో ఈ సినిమా ఒక సన్సేషనల్ లవ్ స్టోరీ. ఈ సినిమా తో భీమనేని పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మారు మ్రోగిపోయింది. 
సుస్వాగతం: 1998 రిలీజ్  (Suswagatham)
Pawan Kalyan, Devayani , Sudhakar, Raghuvaran
ఇది భీమనేని, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం. ఇది తమిళ చిత్రం మాతౄక. ఈ సినిమా లో ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ "నేను మోనార్క్ ని నన్ను ఎవరు మోసం చేయలేరు"  కి మంచి క్రెడిట్స్ దక్కాయి.
ఈ సినిమా కూడా మ్యూసికల్ గా మంచి హిట్ సినిమా గా నిలిచింది. 
సూర్యవంశం: 1998 రిలీజ్  (Suryavamsam)
Venkatesh, meena, radhika, samghavi
ఇది భీమనేని, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. ఇందులో వెంకటేష్ ద్విపాత్రభినయం లో కనిపించారు.  ఈ సినిమా కూడా తమిళ మాతౄక. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 
ఈ సినిమా లో వెంకటేష్ నటన కు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. వెంకటేష్ కు జంటగా మీనా, సంఘవి, రాధిక చేశారు. 
ఈ సినిమా తో భీమనేని కి వరుసగా మూడు సినిమాలు హిట్ గా నిలిచాయి.  ఇప్పటివరకు ఈయన తీసిన సినిమాలు కథాపరం గా, మ్యూసికల్ గా హిట్ అయ్యాయి. 
ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్లు రాబట్టింది. 
సుప్రభాతం: 1998 రిలీజ్ (Suprabhatam)
Srikanth, Raasi, Brahmanandam, Kovai Sarala 
ఇది భీమనేని కి దక్కిన మొదటి ఫ్లాప్ మూవి. ఈ సినిమా కూడా తమిళ మాతౄక నుంచి తీసిందే, కాని తెలుగు లో డిసాస్టర్ అయ్యింది. 
శ్రీకాంత్, రాశి, కోవై సరళ, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు చేశారు. 
ఈ సినిమా లో పాటలు కూడా హిట్ కాలేక పోయాయి. 
స్వప్న లోకం 1999 రిలీజ్: (Swapna Lokam)
Jagapati Babu, Raasi
ఈ సారి భీమనేని, తమిళ మాతౄక వదిలి, సిందీ లో షారూఖ్ ఖాన్ చేసిన కభీ హా కభీ నా సినిమా ని తెలుగు లో స్వప్న లోకం గా రీమేక్ చేసారు. ఈ సినిమా కూడా తెలుగులో డిసాస్టర్ గా నిలిచింది. తెలుగు లో జగపతి బాబు, రాశి నటించారు.  
హిందీ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం మాత్రం తెలుగు లో అంచనాలను అందుకోలేక తలకిందులయ్యింది. 
ఈ సినిమా తర్వాత ఆయన 3 ఏళ్ళూ గ్యాప్ తీసుకున్నారు  
నీ తోడు కావాలి 2002 రిలీజ్ (Nee Thodu Kaavaali)
Charmi, Rimisen, Arjan Baajwa
2 ఫ్లాప్స్ తర్వాత ఆయన స్వీయ నిర్మాత గా నిర్మించిన చిత్రం. ఈ సినిమా ద్వారా చార్మి చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యింది. ఈ సినిమా భీమనేని కి డైరక్ట్ సినిమా, అంటే ఇది ఏ సినిమాకు రీమేక్ కాదు. 
ఈ సినిమా కూడా ఆయన కు నిరాశే మిగిల్చింది. వరుసగా మూడు హిట్లు ఇచ్చిన భీమనేని ఆ తర్వాత వరుసగా 3 ఫ్లాప్స్ కూడా ఇచ్చారు. 
దొంగోడు 2003 రిలీజ్  (Dongodu)
Ravi Teja, Rekha, Kalyani, Tanikella Bharani
ఈ సినిమా మళయాళ మాతౄక. ఈ సినిమా భీమనేని కి పరవాలేదనిపించింది. రవితేజ, కళ్యాణి, రేఖ నటించారు. 
ఈ సినిమా కి విద్యాసాగర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా తర్వాత ఆయన 3 ఏళ్ళ విరామం తీసుకున్నారు. 
అన్నవరం: 2006 రిలీజ్ (Annavaram)
Pawan Kalyan, Asin
ఇది భీమనేని పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా . మొదటి సినిమా సుస్వాగతం మంచి హిట్ సినిమా గా నిలిచి, రెండవది మాత్రం ఫ్లాప్ మూవి అయ్యింది. 
ఈ సినిమా కూడా తమిళ సినిమా నుంచే రీమేక్ చేసారు. సిస్టర్ సెంటిమెంట్ తో తీసిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులు ఆదరించిన విధం గా మన ప్రేక్షకులు ఆదరించలేదు. 
అప్పటికే పవన్ కళ్యాణ్ గ్రాఫ్ డవున్ ఫాల్ లో ఉండటం , పవన్ కల్Yఆణ్ నుంచి ప్రేక్షకులు ఇలాంటి సెంటిమెంట్ సినిమా ను ఊహించలేదు. దాంతో భీమనేని అంచనాలను తలకిందలు చేసింది. 
సుడిగాడు 2012 రిలీజ్: (Sudigadu)
Allari Naresh, Monal Gajjar
ఆరు సంవత్సరాల విరామం తర్వాత తీసిన ఈ సినిమా హిట్ సినిమా గా నిలిచింది. ఈ సినిమా కూడా తమిళ సినిమ రీమేక్.
తమిళ్ లో హిట్ గా నిలిచిన ఈ సినిమా ని తెలుగు లో సుడిగాడు పేరు తో అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ తో తీసారు. సుడిగాడు ఒక వ్యంగ ధోరని తో సాగే కామేడీ సినిమా.  
ఈ సినిమా ఆద్యంతం కామెడీ వ్యంగ దోరని తోనే ఉంటుంది. 
అప్పటికే కామెడి హీరో గా తనకంటూ ఒక స్తానాన్ని ఏర్పరచుకున్న అల్లరి నరేష్ తో చేయడం భీమనేని ఒక ప్లస్ పాయింట్ అయ్యింది. దాదాపు ఆరెళ్ళ తర్వాత తీసిన ఈ సినిమా ని చూస్తుంటే భీమనేని లో ఇంకా సత్తా మిగిలే ఉందని అనిపించింది. 
ఆ  తర్వాత 2016 లో బెల్లంకొండ తో  స్పీడున్నోడు, 2018 లో మళ్ళీ అల్లరి నరేష్ తో సిల్లీ ఫెల్లోస్ 2019 లో ఐశ్వర్యా రాజేష్ తో కౌషల్య క్రిష్ణమూర్తి తీశారు. ఇవన్ని హిట్లు గా నిలిచాయి. 
ఈ పై మూడు సినిమాలు కూడా రీమేక్లే. 
దాంతో రీమేక్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ అయ్యారు భీమనేని 








Comments
Post a Comment