టాప్ హీరోల తో సినిమాలు తీసిన ఈ వివి సత్యనారయణ - E V V Satyanarayana movies with top Tollywood Heroes
కామెడీ సినిమాలకు ఒకప్పుడు ఈయన (EVVV Satyanarayana) కేరాఫ్ ఎడ్రెస్. ఈయన తీసిన సినిమాలు సూపర్ డూపర్ గా హిట్ అయ్యాయి. ఈ వివి సత్యనారయణ తెలుగు లో ఉన్నా టాప్ హీరోలతో సినిమాలు తీసాడు. అవి హిట్ సినిమాలు గా ప్రేక్షకుల ఆదరభిమానాలు కూడా అందుకున్నాయి.
వెంకటేష్: (Victroy Venkatesh)
వెంకటేష్ తో ఈవివి తీసిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. అవన్నీ కామెడీ సినిమాలే.
అబ్బాయిగారు: (Abbayigaru - 1993 release) ఇది ఈవివి వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా. ఈ సినిమా హిందీ బేటా (Beta)సినిమా రీమేక్.
ఈ సినిమా లో వెంకటేష్ కి జంటగా మీనా చేసింది. ఈ సినిమా సంగీతం కీరవాని అందించారు. ఇది ఒక సూపర్ హిట్ చిత్రం. కథా పరంగా మ్యూసిక్ పరం గా ఈ సినిమా హిట్ గా నిలిచింది.
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు:(Intlo Illaalu vantitlo priyuraalu 1996 release)
ఇది వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా. ఇది కూడా అప్పట్లో పెద్ద హిట్ చిత్రం గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ కి జంటగా సౌందర్య, వినీత నటించారు. ఇందులో బ్రహ్మానందం కామెడీ అద్బుతమనే చెప్పాలి. ఈ సినిమాలో వెంకటేష్ తో కలిపి బ్రహ్మానందం చేసిన హ్యూమర్ ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమా ఒక తమిళ సినిమాకు రీమేక్.
వెంకటేష్ తో ఈవివి సత్యనారయణ చేసిన రెండు సినిమాలు రీమేక్ సినిమాలే.
నాగార్జున: (Nagarjuna)
ఈవివి తో నాగార్జున చేసిన సినిమాలు అన్ని హిట్ అవ్వడమే కాకుండా ప్రేక్షకుల మనసులను దోచుకున్నాయి.
వారసుడు: (Varasudu 1993 release)
ఇది వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా. ఈ సినిమా లో నాగార్జున కి జంటగా నగ్మా (Nagma)చేసింది. ఇందులో సూపర్ స్టార్ క్రిష్ణ (Super Star Krishna)స్పెషల్ రోల్ కనిపిస్తారు. ఈ సినిమా హిందీ సినిమా ఫూల్ ఔర్ కాంటే కి రీమేక్. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయ్యింది.
హలో బ్రదర్: (Hello Brother 1994 release)
ఇది వీరి కాంబ్నేషన్ లో వచ్చిన రెండో సినిమా. ఇది అప్పట్లో సంచలన విజయం సాదించింది. ఈ సినిమా జాకి చాన్ చేసిన ట్విన్ డ్రాగన్స్ సినిమా కి రీమేక్. తెలుగు లో చాల సీన్స్ ని ఇంగ్లీష్ సీన్స్ ని అదే విదం గా తీసేసారు.
నాగార్జున ఈ సినిమాలో చేసిన కామెడీ ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కు కీరవాణి మ్యూసిక్ అందించారు, ఆ పాటలు కూడా సూపఋ హిట్ అయ్యాయి. ఈ సినిమాకి కీరవాణి ని బెస్ట్ మ్యూసిక్ డైరక్టర్ గా నంది అవార్డ్ వచ్చింది.
ఇది వీరి కాంబ్నేషన్ లో వచ్చిన రెండో సినిమా. ఇది అప్పట్లో సంచలన విజయం సాదించింది. ఈ సినిమా జాకి చాన్ చేసిన ట్విన్ డ్రాగన్స్ సినిమా కి రీమేక్. తెలుగు లో చాల సీన్స్ ని ఇంగ్లీష్ సీన్స్ ని అదే విదం గా తీసేసారు.
నాగార్జున ఈ సినిమాలో చేసిన కామెడీ ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కు కీరవాణి మ్యూసిక్ అందించారు, ఆ పాటలు కూడా హిట్ అయ్యాయి. ఈ సినిమాకి కీరవాణి ని బెస్ట్ మ్యూసిక్ డైరక్టర్ గా నంది అవార్డ్ వచ్చింది.
ఆవిడా మా ఆవిడే : (Aavida maa Aavide - 1998 release)
Cast - Nagarjuna, Tabu, Hira, Sri hari
ఇది వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా. ఈ సినిమాలో నాగార్జున కి జంటగా హీరా టబూ నటించారు. ఈ సినిమా పరవాలేదనిపించింది. ఈ సినిమా లో కూడా దర్శకుడు కామెడీ కే పెద్ద పీట వేసారు.
చిరంజీవి:
వీరి కాంబినేషన్ లో వచ్చింది ఒకటే సినిమా అదే అల్లుడా మజాకా.
ఈ సినిమా ఒక మాదిరి గా హిట్ అయ్యింది. కొన్ని చోట్ల మాత్రం ఈ సినిమా స్త్రీ లను అగౌరవ పరిచేల ఉందని బ్యాన్ చేయాలని నిరసనలు వ్యక్తం చేసారు. కాని చిరంజీవి అభిమానుల బలం ముందు ఆ నిరసనలు చాలా చిన్నవి అయ్యై.
ఆ తర్వాత ఆ సినిమా చాలా థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుని శతదీనోత్సవ వేడుకలు జరుపుకుంది.
ఈ సినిమాలో కామెడీ కాస్త ద్వందార్ద దోరణి లో సాగడం కొంతమంది ఒప్పుకోలేక పోయారు. కాని అన్ని అడ్డంకులని అదిగమించి ఈ సినిమా హిట్ గా నిలిచింది.
బాలక్రిష్ణ: (Balakrishna)
వీరి కాంబినేషన్ లో కూడా ఒకటే సినిమా వచ్చింది. అదే గొప్పింటల్లుడు (Goppimtalludu 2000 release)
హిందీ లో హిట్ అయిన గోవిందా సినిమా హీరో నెంబర్ 1 సినిమా కి ఇది రీమేక్.
ఈ సినిమాలో బాలక్రిష్ణ కి జంటగా సంఘవి, సిమ్రాన్ నటించారు. ఈ సినిమా థియేటర్ల దగ్గర దెబ్బతింది. ఈవివి కామెడీ కూడా ఈ సినిమాలో పెద్దా గా కనిపించదు. బాలక్రిష్ణ మాస్ యాక్షన్ చూపించాలనే తాపత్రయం లో ఈవివి తన కామేడి ని కాస్త పక్కన పెట్టడం వలన ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.
మొత్తం గా చూస్తే ఈవివి తో చేసిన వెంకటేష్, నాగార్జున సినిమాలు హిట్ గా నిలిచాయి. చిరంజీ వి సినిమా పరవాలేదనిపించింది. ఇక బాలాక్రిష్న తో చేసిన సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
వీరి తో పాటు, మోహన్ బాబు తో అదిరింది అల్లుడు, వీడెవడండీ బాబు సినిమాలి చేసారు.
అందులో వీడెవడండీ బాబు హిట్ అయితే ఇంకొకటి ఫ్లాప్ అయ్యింది. వేడెవడండీ బాబు మాత్రం హిందీ సినిమా అందాజ్ అప్న అప్నా కి ఫ్రీ మేక్.
Comments
Post a Comment