Skip to main content

Posts

Showing posts from December, 2020

వర్మ కరోనా వైరస్ - RGV Corona Virus Review

 వర్మ ఎప్పుడూ ప్రస్తుత పరిస్తితుల మీద సినిమాలు తీస్తుంటాడు. అల్ల వచ్చిన సినిమానే కరోనా వైరస్.  కథ తెర పైన చూసి తెలుసుంటేనే మజా గా ఉంటుంది. కాని మన ప్రధాని, కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఈ సినిమా మొదలవుతుంది.  మనకి అలవాటు లేని లాక్ డౌన్ పరిస్తితుల్లో, ప్రజలు పడ్డ ఇబ్బందులు, తర్వాత, కరోనా ఎక్కడ వ్యాపిస్తుంది అని ప్రజల్లో కలిగిన భయాన్ని, వర్మ బాగా చిత్రీకరించారు. ఒక మధ్య తరగతి కుటుంబం లో లాక్ డౌన్ తర్వాత, సామాజిక దూరం పాటించడం, కరోనా ఎక్కడ వ్యాపిస్తుందేమోనని భయం, అన్నవి తెర పై చూస్తే, మన మధ్యలో చాలా మంది కూడా ఆ సందర్భం లో అలగే ప్రవర్తించారు కదా అనిపిస్తుంది. వర్మ ఎప్పటిలాగానే లాగిక్లు ఇలాంటివి కాకుండా, ఒక కుటుంబం కరోనా వల్ల ఎలా బయపడింది అనేది చూడచ్చు. ఈ సినిమా టైంపాస్ కి ఒక సారి చూడచ్చు.

నిరాడంబరత చాటుకున్న అనుష్క శెట్టి - Anushka Shetty Simplicity

 అనుష్క శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పరిచయం అక్కరలేని నటి. తన కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని, మున్ముందుకు దూసుకెల్తోంది. సినిమా రంగం లో ఎంత ఎత్తు ఎదిగిందో అంత నిరాడంబరంగా తన జీవితం ఉంటుంది. ఈ మధ్య, పశ్చిమ గోదావరి జిల్లలోని పోలవరం లోని ఒక గుడి లో పూజలు చేయించుకోవటానికి, మామూలుగా అందరి తో కలిసి పడవ లో వెళ్ళింది. ఈ సంఘటన చాలు ఆమె నిరాడంబరత చెప్పడానికి. మొఖానికి మాస్క్ పెట్టుకుని, అందరికి తోపాటు పడవ లో వెళ్ళింది, మొదట గుర్తు పట్టక పోయిన తర్వాత గుర్తు పట్టి, జనాలు ఫోటోలు తీసుకున్నారు. కింద వీడియో చాలు ఆమె వ్యక్తిత్వం తెలపటానికి. 

అరియానా నే నా సినిమా హీరోయిన్ - రాం గోపాల్ వర్మ - RGV offering a role to Ariyana in his next movie

 అర్యానా అనే పేరు బిగ్ బాస్ లోకి వచ్చే వరకూ చాలా మందికి తెలీదు. కాస్తో కూస్తో ఆట ఆడుతూ, ఆఖరి వారం వరకు వచ్చేసింది. ఈ వారం సేవ్ అయితే ఇక టాప్ ఫైవ్ కి వెళ్తుంది అరియానా.  ఇక అరియానా బిగ్ బాస్ లోకి రాక ముందు రాం గోపాల్ వర్మ తో ఒక ఇంటర్వ్యూ చేసి అందరి ద్రుషి లో పడింది.  ' ఆమె అడిగిన " మీకు ఈ మధ్య వావ్ అనిపించిన అమ్మాయి ఎవరు" అన్న ప్రస్న కు, వర్మ బదులిస్తూ నువ్వేనని చెప్పాడు. ఈ మధ్య కాలం లో ఒక ఇంటర్వ్యూ లో వర్మ మాట్లాడుతూ, అసలు తనకి బిగ్ బాస్ షో గురించి తెలీదని అది ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఆ సందర్బం లో అరియానా టాపిక్ రాగా, ఆమెను పెట్టి సినిమా తీయాలనుకుంటున్నట్టు, వర్మ తెలిపాడు. మరి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం అరియానా కు తెలిస్తే, ఎలా స్పందిస్తుందో చూడాలి. వర్మ డైరక్షన్ లో కాని, ఆయన నిర్మానం లో కాని నటించాలి అని చాలా మంది నటీ నటులు వువ్వీళ్ళూరుతూ ఉంటారు,  మరి అవకాశం తలుపు తట్టిన అరియానా ఆ అవకాశం వాడుకుంటుందో లేదో వేచి చూడాలి. 

బిగ్ బాస్ 4 విజేత ఎవరో తెలుసా - Biggboss 4 Telugu Title Winner

 బిగ్ బాస్ తెలుగు లో మొదలయ్యి ఇప్పటికి 3 సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ లో శివ బాలాజి టైటిల్ గెలవగా 2, 3 సీజన్ ల లో కౌషల్, రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలిచారు.  ఇప్పుడు 4 వ సీజన్ నడుస్తోంది. 4 వ సీజన్ మొదలయ్యిన కొత్తలో అంత జనరంజకంగా లేదు కానీ వారాలు గడిచే కొద్దీ, జనాలు చూసే విదంగా ఉంటోంది. ఈ సారి ఉన్న సూపర్ సెవన్ లో టాప్ ఫైవ్ కి ఎవరు వస్తారు అన్న అంచనా కి వస్తే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వచ్చు. (Avinash in danger zone) నామినేట్ అయిన ప్రతీసారీ అవినాష్ లో ఉన్న బలహీనతలు బయటపడుతున్నాయి. ఈ సారి నామినేట్ అయిన తర్వాత అవినాష్ లో ఉన్న ఇన్ సెక్యూరిటీ చాలా స్పష్టం గా కనిపిస్తోంది. ఆ విధంగా చూస్తే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వచ్చు. క్రితం వారం ఎవిక్షన్ పాస్ కారణం గా అవినాష్ తప్పించుకున్నా ఈ వారం ఖచ్చితం గా ఎలిమినేట్ అవుతాడు. (Avinash used Eviction Pass in Biggboss 4 Telugu reality show). ఇక టాప్ ఫైవ్ లోకి అభిజీత్, సొహైల్, అఖిల్, మోనాల్, అరియాన/హారికా వస్తారు. వీళ్ళల్లో టాప్ 3 కి అభిజిత్, అఖిల్, సొహైల్ వచ్చే అవకాశం ఎక్కువ గా ఉంది. (Top 5 contestants in Telugu Biggboss 4 - Akhil, A...