బిగ్ బాస్ తెలుగు లో మొదలయ్యి ఇప్పటికి 3 సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ లో శివ బాలాజి టైటిల్ గెలవగా 2, 3 సీజన్ ల లో కౌషల్, రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలిచారు.
ఇప్పుడు 4 వ సీజన్ నడుస్తోంది. 4 వ సీజన్ మొదలయ్యిన కొత్తలో అంత జనరంజకంగా లేదు కానీ వారాలు గడిచే కొద్దీ, జనాలు చూసే విదంగా ఉంటోంది.
ఈ సారి ఉన్న సూపర్ సెవన్ లో టాప్ ఫైవ్ కి ఎవరు వస్తారు అన్న అంచనా కి వస్తే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వచ్చు. (Avinash in danger zone)
నామినేట్ అయిన ప్రతీసారీ అవినాష్ లో ఉన్న బలహీనతలు బయటపడుతున్నాయి. ఈ సారి నామినేట్ అయిన తర్వాత అవినాష్ లో ఉన్న ఇన్ సెక్యూరిటీ చాలా స్పష్టం గా కనిపిస్తోంది. ఆ విధంగా చూస్తే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వచ్చు. క్రితం వారం ఎవిక్షన్ పాస్ కారణం గా అవినాష్ తప్పించుకున్నా ఈ వారం ఖచ్చితం గా ఎలిమినేట్ అవుతాడు. (Avinash used Eviction Pass in Biggboss 4 Telugu reality show).
ఇక టాప్ ఫైవ్ లోకి అభిజీత్, సొహైల్, అఖిల్, మోనాల్, అరియాన/హారికా వస్తారు. వీళ్ళల్లో టాప్ 3 కి అభిజిత్, అఖిల్, సొహైల్ వచ్చే అవకాశం ఎక్కువ గా ఉంది. (Top 5 contestants in Telugu Biggboss 4 - Akhil, Abhijit, SOhel, Monal, Harika/Ariyana)
అఖిల్ టాప్ 2 కి రాడు. ఎందుకంటే, గేం తోపాటు, మోనాల్ తో చేసిన ముచ్చట్లు, అర్దరాత్రి ఎలిమినేట్ చేసే టాస్క్ లో కనబరచిన ఓవర్ కాంఫిడెన్స్ ఇవన్నీ, అఖిల్ ని 3 పొసిషన్ లో నిలబెట్టాయి. (Akhil Sarthak Over Confidence)
అభిజిత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, అతను బుర్ర పెట్టి చేసే పనులు చాలా మందికి నచ్చాయి. అప్పుడప్పుడు అభిజిత్ చేసే పనులు కొన్ని తెలివి తక్కువ పనుల వలన కాస్త నెగెటివ్ అఫక్ట్ పడినా అది టాప్ పొసిషన్ దెబ్బ తీసేలా ఎమీ కాలేదు.
ఈ విధం గా చూస్తే అభిజిత్ మరియు సొహైల్ టాప్ 2 లో ఉంటారు. సోహైల్ ఆట తీరు చూస్తే చాలా అద్భుతం గా ఉందనే చెప్పాలి. ఒకో సారి సొహైల్ లో ఉండే ఆవేశం, కోపం, పట్టుదల ఇవ్వన్ని చూస్తే బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ కౌషల్ లా అనిపిస్తుంది.
సొహైల్ కాని అభిజిత్ కాని బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎకువ. (Sohel have chances for BiggBoss 4 Telugu title winner)
Comments
Post a Comment