Skip to main content

Posts

Showing posts from November, 2021

తెర పై కనిపించిన తెలుగు గాయకులు - Singers on screen appearence

 తెలుగు లో ఎంతో మంది గాయకులు ఉంటే, అందులో కొంతమంది తెర పై కనిపించారు. కొంతమంది తెర పై ఎవో పాటల కోసం కనిపిస్తే, కొంతమంది, నటన కూడా చేసారు. వారిలో కొంతమంది. ఎస్పీ బాలూ: ఈయన గురించి తెలియని వారంటూ ఉండరు. ఈయన పాడిన పాటలు ఎన్నో, జనరంజకంగా మారాయి. ఈయన పాటలు పాడటమే కాకుండా, సినిమాలు కూడా చేసారు. ఈయన సినిమాల్లో, చేసిన పాత్రలు కూడా, ప్రాధన్యత కలిగినవే. ఈయన చేసిన ఆఖరి సినిమా 2018 లో వచ్చిన దేవదాసు.  మనో: ఈయన పేరు నాగూర్ బాబూ. కానీ, మనో గా అందరికి సుపరిచితం. ఈయన పాడిన ఎన్నో పాటలు కూడా హిట్ అయ్యాయి. ఈయన పాటలు పాడటమే కాకుండా డబ్బింగ్ కూడా చెప్తారు.  ఈయన ఎక్కువగా రజినికాంత్ కి డబ్బింగ్ చెప్తారు. ఈయన కూడా ఎన్నో సినిమాల్లో, తెర పై కనిపించారు. ఈయన తెలుగు, తమిళ సినిమాల్లో, నటించారు. ఎస్పీ శైలజ: ఈవిడ గాయని గా ఎన్నో పాటలు పాడి స్రోతల మన్ననలు పొందారు. ఈవిడ్ అనటించిన సినిమా సాగర సంగమం. విశ్వనాథ్ దర్శకత్వం లో నటించిన ఈ సినిమాలో, శైలజ నటన కి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈవిడ శుభలేఖ సుధకర్ కి భార్య. దేవిశ్రీ ప్రసాద్: ఈయన మ్యూసిక్ డైరక్టర్ గానే కాకుండా పాటలు కూడా పాడారు. ఈయన కొన్న...

హాలీవుడ్ సినిమాల్లో కనిపించిన తెలుగు నటులు వీరే - Telugu artists in Hollywood movies

 మన తెలుగు నటులలో కొంతమంది హాలీవుడ్ సినిమాల్లో  (Hollywood Movies) నటించారు. వారిలో కొంతమంది ఇక్కడ శరత్ బాబు (Sarath Babu): ఈయన తెలుగు సినిమాల్లో, తనకంటూ ఒక ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. ఈయన ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటీంచారు. 2007 లో అమెరికా లో రిలీజ్ అయిన వాకింగ్ డ్రీంస్  (Walking Dreams) అనే సినిమాలో డాక్టర్ కుమార్ పాత్రలో కనిపిస్తారు.  నెపోలియన్ (Napoleon): ఈయన తెలుగు సినిమా హలో బ్రదర్ లో విలన్ పాత్ర వేసారు. ఈయనకి కూడా హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. 2019 లో అమెరికా లో రిలీజ్ అయిన క్రిస్టిమస్ కూపన్ (Christmas Coupon) అనే సినిమాలో ఏజంట్ కుమార్ అనే పాత్ర లో కనిపిస్తారు.  సుమన్ (Suman): ఈయన తెలుగు సినిమాలో ఎన్నో సినిమాలు చేసారు. ఈ మధ్య ఈయన ఎక్కువగా తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఈయన 2007 లో డెత్ ఎండ్  టాక్సీస్ (Death and Taxis) అనే హాలీవుడ్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఈయన ఒక 10 నుండి 15 నిముషాలు కనిపిస్తారు.  లక్ష్మీ మంచు (Manchu Lakshmi): ఈమె మోహన్ బాబు కుమార్తె గా కాకుండా, నటన తో తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఈమే కూ...

రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించిన నాగార్జున సినిమాలు ఫ్లాప్ - Nagarjuna movies turned flop when acted with Rajendra Prasad

నాగార్జున (King Nagarjuna)పేరు కి తగ్గట్టే మన్మదుడు అంటే, రొమాంటిక్ హీరో. రాజేంద్ర ప్రసాద్ (Comedy King Rajendra Prasad) ఏమో కామెడీ కింగ్. వీళ్ళ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక నాగార్జున కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించినవి మూడే సినిమాలు. ఆ మూడూ  ఫ్లాప్ గా మిగలడం తో మళ్ళీ కలిసి నటించే ప్రయత్నం చేయలేదు.  ఒక సినిమా కెప్టన్ నాగార్జున (Captain Nagarjuna). ఈ సినిమాకి వి బి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం (Direction V B Rajendra Prasad) వహించారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక ఆర్టిస్ట్ పాత్ర లో కనిపిస్తారు. ఈ సినిమా 1986 లో రిలీజ్ అయ్యింది. ఇది ఒక ఫ్లాప్ మూవీ గా మిగిలిపోయింది. 1986 లో రిలీజ్ అయిన మరో సినిమా అరన్య కాండ (Aranya Kanda). ఈ సినిమాకి క్రాంతి కుమార్ (Director Kranti Kumar) దర్శకత్వం వహించార్రు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక అడవి లో నివసించే వ్యక్తి పాత్ర లో కనిపిస్తారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలిపోయింది.  2001 లో వచ్చిన సినిమా ఆకాశ వీధిలో (Aakasa Vidhilo). ఈ సినిమా కి సింగీతం శ్రీనివాసరావు (Simgitham Srinivasa Rao) దర్శకత్వం వహించ...

తన పేరే పాత్ర పేరు గా పెట్టుకుని చేసిన చిరంజీవి సినిమాలు - Chiranjeevi name it self as his Character names

 1980 లో మొగుడు కావాలి (Mogudu Kavali) అనే సినిమాలో, చిరంజీవి తన పేరు నే పాత్ర కి పెట్టారు. కట్టా సుబ్బారావు దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా లో చిరంజీవి (Megastar Chiranjeevi) హీరో గా చేసారు. అప్పటికి ఇంకా చిరంజీవి ఒక నటుడి గానే తెలుసు.  1982 లో వచ్చిన బంధాలు, అనుబంధాలు (Bandhaalu Anubandhaalu) సినిమా లో కూడా చిరంజీవి పాత్ర పేరు చిరంజీవే. ఈ సినిమాలో చిరంజీవి పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర చేసారు. ఈ సినిమా చిరంజీవి కి 50 వ సినిమా. ఈ సినిమా లో హీరో గా శోభన్ బాబు, చేస్తే, చిరంజీవి ఒక ంఖ్య పాత్ర లో కనిపించారు. 1982 లో వచ్చిన మరొక సినిమా అభిలాష (Abhilasha), ఇది యండమూరి (Yandamuri Novel) నవల ఆధారంగా తీసిన సినిమా. ఈ సినిమాలో కూడా, చిరంజీవి పాత్ర పేరు చిరంజీవే. ఈ సినిమాలో ఈయన లాయర్ పాత్ర లో కనిపిస్తారు. ఈయనకు జంటగా రాధిక చేసారు. ఈ సినిమాకు దర్శకుడు కోదండరామిరెడ్డి (Director A Kodanda Rami Reddy). ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్. 1985 లో వచ్చిన చిరంజీవి అనే సినిమాలో చిరంజీవి పాత్ర పేరు చిరంజీవే. ఈ సినిమా పేరు కూడా అదే కావటం విశేషం. ఈ సినిమాకు దర్శకుడు రాజేంద్రన్. ఈ సినిమాలో చి...

తండ్రి కథలకు తనయుడి దర్శకత్వం - యస్ యస్ రాజమౌళి - SS Rajamouli directs father stories

ఇప్పటి వరకు రాజమౌళి 11 సినిమాలు తీసాడు, 12 వ సినిమాగా ఆర్ ఆర్ ఆర్ తీస్తున్నాడు. ఫ్లాప్ అంటే అర్దం తెలియని దర్శకుడు రాజమౌళి (Director S S Rajamouli).   ఈయన తీసిన చాలా సినిమాలకు, ఈయన తండ్రి, విజయేంద్ర ప్రసాద్  (K V Vijayendra Prasad) కథలు అందిస్తాడు.  సింహాద్రి (Simhadri )సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ రాయగా, రాజమౌళి దర్శకత్వం చేసారు. ఈ సినిమా ముందుగా బాలక్రిష్ణ తో తీయాలని అనుకున్నారు, కాని, ఆ తర్వాత, జూనియర్ ఎంటీఆర్ (Jr NTR) హీరో గా చేసి, ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 లో వచ్చిన సై (Sye) సినిమాకు కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించాడు. ఈ సినిమా అంతా రగ్బీ ఆట గురించి ఉంటుంది. 2005 లో వచ్చిన ఇంకొక సినిమా చత్రపతి (Chatrapati) ప్రభాస్ (Prabhas) కి మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా. ఈ సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే విక్రమార్కుడు, యమదొంగ, మగధీరా, బాహుబలి 1& 2 , ఇంకా షూటింగ్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలన్నింటికీ, విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈయన ఇచ్చిన కథలకు, రాజమౌళి, దర్సకత్వ ...