తెలుగు లో ఎంతో మంది గాయకులు ఉంటే, అందులో కొంతమంది తెర పై కనిపించారు. కొంతమంది తెర పై ఎవో పాటల కోసం కనిపిస్తే, కొంతమంది, నటన కూడా చేసారు. వారిలో కొంతమంది.
ఎస్పీ బాలూ:
ఈయన గురించి తెలియని వారంటూ ఉండరు. ఈయన పాడిన పాటలు ఎన్నో, జనరంజకంగా మారాయి. ఈయన పాటలు పాడటమే కాకుండా, సినిమాలు కూడా చేసారు. ఈయన సినిమాల్లో, చేసిన పాత్రలు కూడా, ప్రాధన్యత కలిగినవే. ఈయన చేసిన ఆఖరి సినిమా 2018 లో వచ్చిన దేవదాసు.
మనో:
ఈయన పేరు నాగూర్ బాబూ. కానీ, మనో గా అందరికి సుపరిచితం. ఈయన పాడిన ఎన్నో పాటలు కూడా హిట్ అయ్యాయి. ఈయన పాటలు పాడటమే కాకుండా డబ్బింగ్ కూడా చెప్తారు. ఈయన ఎక్కువగా రజినికాంత్ కి డబ్బింగ్ చెప్తారు. ఈయన కూడా ఎన్నో సినిమాల్లో, తెర పై కనిపించారు. ఈయన తెలుగు, తమిళ సినిమాల్లో, నటించారు.
ఎస్పీ శైలజ:
ఈవిడ గాయని గా ఎన్నో పాటలు పాడి స్రోతల మన్ననలు పొందారు. ఈవిడ్ అనటించిన సినిమా సాగర సంగమం. విశ్వనాథ్ దర్శకత్వం లో నటించిన ఈ సినిమాలో, శైలజ నటన కి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈవిడ శుభలేఖ సుధకర్ కి భార్య.
దేవిశ్రీ ప్రసాద్:
ఈయన మ్యూసిక్ డైరక్టర్ గానే కాకుండా పాటలు కూడా పాడారు. ఈయన కొన్ని సినిమాల్లో, గెస్ట్ రోల్ లో కనిపించారు. ఎక్కువ సినిమాల్లో, ఈయన ఒక ప్రత్యేక పాట పాడి, ఆ పాటలోనే కనిపించారు.
for latest newspaper daily you can get all news updates from this website i always visit click now
ReplyDelete