మన తెలుగు నటులలో కొంతమంది హాలీవుడ్ సినిమాల్లో (Hollywood Movies) నటించారు. వారిలో కొంతమంది ఇక్కడ
శరత్ బాబు (Sarath Babu):
ఈయన తెలుగు సినిమాల్లో, తనకంటూ ఒక ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. ఈయన ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటీంచారు. 2007 లో అమెరికా లో రిలీజ్ అయిన వాకింగ్ డ్రీంస్ (Walking Dreams) అనే సినిమాలో డాక్టర్ కుమార్ పాత్రలో కనిపిస్తారు.
నెపోలియన్ (Napoleon):
ఈయన తెలుగు సినిమా హలో బ్రదర్ లో విలన్ పాత్ర వేసారు. ఈయనకి కూడా హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. 2019 లో అమెరికా లో రిలీజ్ అయిన క్రిస్టిమస్ కూపన్ (Christmas Coupon) అనే సినిమాలో ఏజంట్ కుమార్ అనే పాత్ర లో కనిపిస్తారు.
సుమన్ (Suman):
ఈయన తెలుగు సినిమాలో ఎన్నో సినిమాలు చేసారు. ఈ మధ్య ఈయన ఎక్కువగా తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఈయన 2007 లో డెత్ ఎండ్ టాక్సీస్ (Death and Taxis) అనే హాలీవుడ్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఈయన ఒక 10 నుండి 15 నిముషాలు కనిపిస్తారు.
లక్ష్మీ మంచు (Manchu Lakshmi):
ఈమె మోహన్ బాబు కుమార్తె గా కాకుండా, నటన తో తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఈమే కూడా 2 హాలీవుడ్ సినిమాలో చేసింది. 2009 ళో వచ్చిన డెడ్ ఐర్ (Dead Air) అనే సినిమాలో గబ్బి అనే పత్రలో కనిపిస్తారు.
Comments
Post a Comment