తన పేరే పాత్ర పేరు గా పెట్టుకుని చేసిన చిరంజీవి సినిమాలు - Chiranjeevi name it self as his Character names
1980 లో మొగుడు కావాలి (Mogudu Kavali) అనే సినిమాలో, చిరంజీవి తన పేరు నే పాత్ర కి పెట్టారు. కట్టా సుబ్బారావు దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా లో చిరంజీవి (Megastar Chiranjeevi) హీరో గా చేసారు. అప్పటికి ఇంకా చిరంజీవి ఒక నటుడి గానే తెలుసు.
1982 లో వచ్చిన బంధాలు, అనుబంధాలు (Bandhaalu Anubandhaalu) సినిమా లో కూడా చిరంజీవి పాత్ర పేరు చిరంజీవే. ఈ సినిమాలో చిరంజీవి పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర చేసారు. ఈ సినిమా చిరంజీవి కి 50 వ సినిమా. ఈ సినిమా లో హీరో గా శోభన్ బాబు, చేస్తే, చిరంజీవి ఒక ంఖ్య పాత్ర లో కనిపించారు.
1982 లో వచ్చిన మరొక సినిమా అభిలాష (Abhilasha), ఇది యండమూరి (Yandamuri Novel) నవల ఆధారంగా తీసిన సినిమా. ఈ సినిమాలో కూడా, చిరంజీవి పాత్ర పేరు చిరంజీవే. ఈ సినిమాలో ఈయన లాయర్ పాత్ర లో కనిపిస్తారు. ఈయనకు జంటగా రాధిక చేసారు. ఈ సినిమాకు దర్శకుడు కోదండరామిరెడ్డి (Director A Kodanda Rami Reddy). ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్.
1985 లో వచ్చిన చిరంజీవి అనే సినిమాలో చిరంజీవి పాత్ర పేరు చిరంజీవే. ఈ సినిమా పేరు కూడా అదే కావటం విశేషం. ఈ సినిమాకు దర్శకుడు రాజేంద్రన్. ఈ సినిమాలో చిరంజీవి కి జంటగా విజయశాంతి చేసారు.
Comments
Post a Comment