Skip to main content

Posts

Showing posts from October, 2021

పునీత్ ని హీరో గా పరిచయం చేసిన పూరి - Director Puri Jagannath got a chance to introduce Puneet Rajkumar as Hero

హీరో పునీత్ రాజ్ కుమార్ (Puneet Rajkumar) మరణ వార్త అందరి హ్రుదయాలను కలిచివేసింది. 46 ఏళ్ళ వయసులో ఆయన సాధించిన కీర్తి అనిర్వచనీయం.  2002 లో అప్పు (Kannada Movie Appu) అనే సినిమా తో సాండల్ వుడ్ కి హీరో గా పరిచయం అయ్యారు. ఆ సినిమాను తెలుగు లో ఇడియట్ గా రీమేక్ చేసారు. అప్పు సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం  (Director Puri Jagannath)వహించారు. ఆ సినిమా విజయవంతం అయ్యింది. ఆ తరువాత పునీత్ రాజ్ కుమార్ వరుస హిట్లతో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ఈయనను మొదటి సారిగా హీరోగా పరిచయంచేస్తూ దర్శకత్వం వహించే బాధ్యత పూరి కి దక్కటం పూరీ ఎంతో ఆనందించారు.  ఈయన చేసిన కన్నడ సినిమాలు, తెలుగులోకి కూడా రీమేక్ అయ్యాయి. అప్పు సినిమా ని తెలుగులో ఇడియట్ గా (Idiot - Raviteja and Rakshitha) రీమేక్ చేసారు. ఇడియట్ సినిమా ఇక్కడ కూడా విజయవంతం అయ్యింది.  2003 లో వచ్చిన అభి (Abhi) సినిమాను తెలుగు లో అభిమన్యు గా రీమేక్ చేసారు. అభిమన్యు కూడా తెలుగు లో హిట్ సాధించింది.  తెలుగు లో వచ్చిన ఆంధ్రావాలా, కన్నడ లో వీర కన్నడిగ (Veera Kannadiga) అనే పేరు తో రిలీజ్ అయ్యిన్ విజయవంతం అయ్యింది. తెలుగు లో వచ్చిన ఆంధ్రవాలా కు పూ

చిరంజీవి ని హిందీ కి పరిచయం చేసిన రవిరాజా పినిశెట్టి - Raviraja Pinisetty introduced Chiranjeevi in to Bollywood

 మెగా స్టార్ చిరంజీవి తెలుగు సినిమా రంగం లో తనకంటూ ఒక స్థాయి ని ఏర్పరుచుకున్నారు. 1983 లో ఖైదీ సినిమాతో మాస్ ప్రేక్షకుల మన్ననలు పొంది అప్పటి నుండి, సుప్రీం హీరో స్థాయి నుంచి, మెగాస్టార్ స్థాయి కి చేరుకున్నారు.  ఈయన ను హిందీ చిత్రసీమ కు పరిచయం చేసిన క్రెడిట్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కి దక్కింది. తెలుగు లో కోడి రామక్రిష్ణ దర్శకత్వం లో వచ్చిన అంకుశం ను హిందీ లోకి ప్రతిబంధ్ సినిమా గా రీమేక్ చేసారు. హిందీ సినిమాను దర్శకత్వం చేసే బాధ్యత దర్శకుడు రవిరాజా పినిశెట్టి కి దక్కింది. ఈ సినిమా ద్వారా హింది చిత్ర సీమ కి చిరంజీవి పరిచయం అయ్యి, జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఈ సినిమా హిందీ లో కూడా విజయవంతం అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి పోలీస్ ఆఫీసర్ గా చేసారు, ఆయనకు గురువు గా సోమయాజులు చేసారు.  తెలుగులో రాజశేఖర్ నటించిన ఈ సినిమా హిందీ లో చిరంజీవి, హీరో గా పరిచయం అయ్యి, ఆయనకు జంట గా జూహీ చావ్ల చేసారు.  ఈ సినిమాకు చిరంజీవి కి ఉత్తమ నటుడి గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది.  

ప్రయత్నాలకు మారుపేరు దర్శకుడు సింగీతం - Singeetam Srinivasa Rao an experimental director

ఈ తరం యువత కు అంతగా పరిచయం లేని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. (Singeetam Srinivasa Rao) ఈయన మెగాఫోను పట్టి చాలా సంవత్సరాలే అయ్యింది. ఈయన చివరగా దర్శకత్వం చేసిన సినిమా 2013 లో వెల్కం ఒబామా (Welcome Obama).  ఈయన చేసిన సినిమాలలో చాలా వరకూ ప్రయోగాలే. ప్రయోగాత్మక సినిమాలన్నీ హిట్ సినిమాలే. 1972 లో నీతీ నిజాయితీ అనే సినిమా తో దర్శకుడు గా పరిచయం అయ్యి, తెలుగు, తమిళం, కన్నడ భాషలు అన్ని కలిపి 53 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన మాయబజార్ సినిమాకు సహాయ దర్శకుడు. 1987 లో పుష్పక విమానం (Pushpaka Vimanam) అనే సినిమాతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు సింగీతం. ఈ సినిమాలో డయాలగ్ అనేదే ఉండదు. ఇది మూకీ సినిమాగా ప్రఖ్యాతి గాంచింది. ఈ చిత్రానికి గానూ, సింగీతం గారికి ఉత్తమ దర్శకుడి గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ పొందారు. 1989 లో విచిత్ర సోదరులు (Vichitra Sodarulu) అనే సినిమా ద్వారా మరొక ప్రయోగం చేసారు.ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసారు, ఒక కమల్ హాసన్ (Kamal Hasan) మాములుగా ఉండి, ఇంకొక కమల్ హాసన్ మరుగుజ్జుగా చూపించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో కెమేరా ట్రిక్స్ తో కమల్ హాసన్ ను మరుగుజ్