చిరంజీవి ని హిందీ కి పరిచయం చేసిన రవిరాజా పినిశెట్టి - Raviraja Pinisetty introduced Chiranjeevi in to Bollywood
మెగా స్టార్ చిరంజీవి తెలుగు సినిమా రంగం లో తనకంటూ ఒక స్థాయి ని ఏర్పరుచుకున్నారు. 1983 లో ఖైదీ సినిమాతో మాస్ ప్రేక్షకుల మన్ననలు పొంది అప్పటి నుండి, సుప్రీం హీరో స్థాయి నుంచి, మెగాస్టార్ స్థాయి కి చేరుకున్నారు.
ఈయన ను హిందీ చిత్రసీమ కు పరిచయం చేసిన క్రెడిట్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కి దక్కింది. తెలుగు లో కోడి రామక్రిష్ణ దర్శకత్వం లో వచ్చిన అంకుశం ను హిందీ లోకి ప్రతిబంధ్ సినిమా గా రీమేక్ చేసారు. హిందీ సినిమాను దర్శకత్వం చేసే బాధ్యత దర్శకుడు రవిరాజా పినిశెట్టి కి దక్కింది.
ఈ సినిమా ద్వారా హింది చిత్ర సీమ కి చిరంజీవి పరిచయం అయ్యి, జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఈ సినిమా హిందీ లో కూడా విజయవంతం అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి పోలీస్ ఆఫీసర్ గా చేసారు, ఆయనకు గురువు గా సోమయాజులు చేసారు.
తెలుగులో రాజశేఖర్ నటించిన ఈ సినిమా హిందీ లో చిరంజీవి, హీరో గా పరిచయం అయ్యి, ఆయనకు జంట గా జూహీ చావ్ల చేసారు. ఈ సినిమాకు చిరంజీవి కి ఉత్తమ నటుడి గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది.
Comments
Post a Comment