డబల్ యాక్షన్ మూవీస్ అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ యూజ్ చేసి తీస్తున్నారు. కాని ఒకప్పుడు డూప్ తో కొన్ని సీన్లు, కెమెరా ట్రిక్స్ తో కొన్ని సీన్లు తీసేవారు. మన స్టార్లు అందరూ ఇప్పటికే చాలా డబల్ యాక్షన్ మూవీస్ తీసారు. కానీ తెలుగు లో మొదటి సారిగా డబల్ యాక్షన్ సినిమా తీసింది దర్శకుడు ఆదుర్తి సుబ్బా రావు. ఆ సినిమా నే ఇద్దరు మిత్రులు. ఈ సినిమా బెంగాలి లో హిట్ అయిన తేషార్ ఘర్ అనే సినిమా కి రీమేక్.
ఇద్దరు మిత్రులు సినిమాని డిసింబర్ 29 1961 లో మ్యాటినీ షో తో రిలీజ్ చేసారు.
Iddaru Mitrulu - 1961 december 29th
ANR, Raja Sulochana, Padmanabham, Relangi, Ramana Reddy, Surya Kantham
Adurthi Subba Rao
ఈ సినిమా లో నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao)హీరో గా చేసరు. ఆయన కు జంటగా రాజ సులోచన, ఈ వీ సరోజా, నటించారు. వారి తో పాటు గుమ్మడి, రేలంగి, పద్మనాభం, సూర్యా కాంతం, శారద, రమణా రెడ్డి వంటి హేమా హేమీలు నటించారు.
ఈ సినిమాకు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు (Director K Viswanath) అసోసియేట్ దర్శకత్వం వహించారు.
త్రివిక్రం కి "అ" అనే అక్షరానికి సంబందం ఏమిటో
ఈ సినిమా కి సాలూరి రాజేశ్వర రావు (Saluri Rajeswara Rao)సంగీత దర్శకుడు గా పరిచయం అయ్యారు. ఆయన ఈ సినిమాకు అందించిన త్యూన్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఇదే బ్యానర్ లో సాలూరి రాజేస్వర రావు గారు 9 సినిమాలు చేసారు. సాలూరి రాజేశ్వర రావు కొడుకు ఇప్పటి సంగీత దర్శకుడు కోటి.(Music Director Koti)
ఈ సినిమా ఆద్యంతం కామేడీ తో నిండి ఉంటుంది. సినిమా చివరి వరకు విలన్ ఎవరనేది తెలీదు. ఈ సినిమాలో రేలంగి, సూర్యాకంతం, పద్మనాభం, రమణా రెడ్డి చేసిన కామెడీ అద్భుతమనే చెప్పాలి.
ఎటువంటి గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో ఈ సిన్మా చాలా అద్భుతం గా తెర కెక్కింఛారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు. ఇప్పటికీ ఈ సినిమా లో ఏ సన్నివేశం కూడా బోర్ కొట్టదు.
Comments
Post a Comment