చాలా మంది హీరోలు విశ్వనాథ్ గారి (Director K Viswanath) దర్శకత్వం లో సినిమా చేయాలని తహ తహ లాడుతారు. కాని ఆ అద్రుష్టం కొంతమంది హీరోలకి మాత్రమే దక్కింది.
Mega Star Chiranjeevi:
చిరంజీవి: ఈయన హీరో గా ఒక స్టేజ్ ఎక్కిన రోజుల్లో విశ్వనాథ్ గారు శుభలేఖ (Subhalekha) అనే సినిమా 1982 లో తీసారు. ఆ సినిమా ద్వారా చిరంజీవి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా వచ్చింది. వారిలో చిరంజీవి ఒకరు. శుభలేఖ సినిమా లో ఒక సన్నివేశం లో చిరంజీవి గారు చేసే శాస్త్రీయ న్రుత్యం అద్బుతమనే చెప్పాలి.
ఆ తర్వాత 1987 లో స్వయంక్రుషి (Swayam Krushi) సినిమా తీసి పెద్ద హిట్ సాదించారు విశ్వనాథ్ గారు. మాస్ హీరో గా అప్పటికి చిరంజీవి కి మాస్ ప్రేక్షకుల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కాని విశ్వనాథ్ గారికి ఆయన స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం తో తీసిన స్వయం క్రుషి అన్ని విదాల విజయం సాదించింది.
1992 లో మళ్ళీ ఒక హిట్ తీసారు. అదే ఆపద్బాందవుడు (Aapadbandhavudu). ఈ సినిమా కి చిఒరంజీవి గారికి బెస్త్ యాక్టర్ గా నంది అవర్డ్ వచ్చింది.
విశ్వనాథ్ గారు తీసిన సినిమాలకి ఎప్పుడూ చిరంజీవి గారికి ఎదోక అవార్డ్ వచ్చింది.
ఇక్కడ గమనిస్తే విశ్వనాథ్ గారు ప్రతీ 5 ఏళ్ళ కి ఒక సారి చిరంజీవి గారితో సినిమా తీసారు.
1982 లో శుభలేఖ, 1987 లో స్వయం క్రుషి, 1992 లో ఆపద్బాందవుడు.
Comments
Post a Comment