బిగ్ బాస్ కంటెస్టంట్ స్వాతీ దీక్షిత్ గురించి చాలామందికి తెలియని నిజాలు - Facts about Biggboss 4 contestant Swathi Deekshit
ఈ సారి బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ కాస్త డల్ గానే సాగుతోంది. కంటెస్టంట్ల మద్య పోటీ పెద్దగా లేదు. అది పెంచటానికి బిగ్ బాస్ నిర్వాహకులు చాలా ప్రయత్నాలు చేస్తోంది. మొదటగా కుమార్ సాయి పంపన వైల్డ్ కార్డ్ గా రాగ అంత గా ప్రభావం చూపలేదు. కుమార్ సాయి, సినిమాల్లో ఉన్నంత యాఖ్టివ్ గా ఇక్కడ లేడు. తర్వాత అవినాష్ వచ్చాక కాస్త అతను చేసే కామెడీ పర్వాలేదనిపించింది. అమ్మ రాజశేకర్ కామెడీ తో విసిగిపోయిన జనాలకి అవినాష్ కామెడీ ఊరటనిచ్చింది. హారిక ఫేక్ ఎలిమినేషన్ ఇవన్నీ కాస్త బిగ్ బాస్ లో జనాలను చూసే ప్రయత్నం పెంచటానికి బిగ్ బాస్ చేసిన హంగామ. ఆ తర్వాత స్వాతీ దీక్షిత్ రాక, ఆమె ఇచ్చే బహుమానాల కోసం అమ్మ రాజశేకర్ డైలాగులు, మెహ్బూబ్ విన్యాసాలు, ఇలా కొన్ని టాస్క్ ల తో షో పరవాలేదనిపించింది. కానీ ఈ స్వాతీ దీక్షిత్ ఎవరు అని చాలామంది జనాలకి తెలియదు. స్వాతీ దీక్షిత్ 2009 లో ఈ టివి నిర్వహించిన అందమైన భామలు టైటిల్ విన్నర్. వర్మ తీసిన పట్ట పగలు అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో ఒక ప్రదాన పాత్ర పోషించింది. కాని ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. తర్వాత బ్రేక్ అప్ సినిమా చేస...