టాప్ హీరోల తో సినిమాలు తీసిన ఈ వివి సత్యనారయణ - E V V Satyanarayana movies with top Tollywood Heroes
కామెడీ సినిమాలకు ఒకప్పుడు ఈయన (EVVV Satyanarayana) కేరాఫ్ ఎడ్రెస్. ఈయన తీసిన సినిమాలు సూపర్ డూపర్ గా హిట్ అయ్యాయి. ఈ వివి సత్యనారయణ తెలుగు లో ఉన్నా టాప్ హీరోలతో సినిమాలు తీసాడు. అవి హిట్ సినిమాలు గా ప్రేక్షకుల ఆదరభిమానాలు కూడా అందుకున్నాయి. వెంకటేష్: (Victroy Venkatesh) వెంకటేష్ తో ఈవివి తీసిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. అవన్నీ కామెడీ సినిమాలే. అబ్బాయిగారు: (Abbayigaru - 1993 release) ఇది ఈవివి వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా. ఈ సినిమా హిందీ బేటా ( Beta )సినిమా రీమేక్. ఈ సినిమా లో వెంకటేష్ కి జంటగా మీనా చేసింది. ఈ సినిమా సంగీతం కీరవాని అందించారు. ఇది ఒక సూపర్ హిట్ చిత్రం. కథా పరంగా మ్యూసిక్ పరం గా ఈ సినిమా హిట్ గా నిలిచింది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు:(Intlo Illaalu vantitlo priyuraalu 1996 release) ఇది వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా. ఇది కూడా అప్పట్లో పెద్ద హిట్ చిత్రం గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ కి జంటగా సౌందర్య, వినీత నటించారు. ఇందులో బ్రహ్మానందం కామెడీ అద్బుతమనే చెప్పాలి. ఈ సినిమాలో వెంకటేష్ తో కలిపి బ్రహ్...