వైవిద్య పాత్రలు సినిమాలతో ప్రేక్షకులకు షాక్ నిచ్చిన తెలుగు హీరోలు - Tollywood Heroes different movies
చిరంజీవి, వెంకటేష్, నాగర్జున తెలుగు చిత్ర పరిశ్రమ లో చాలా హిట్లు ఇచ్చారు. ఈ హీరోలకి ప్రజాభిమానం. ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఈ హీరోలు పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన తర్వాత వైవిద్య పాత్రలు, సినిమాలు చేసి, ప్రజల అభిమానాన్ని దక్కించుకోవటమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. చిరంజీవి: అప్పటికే మెగా హీరో గా పేరుపొందిన చిరంజీవి, 1991 లో ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు వంటి హిట్లు ఇచ్చిన తర్వాత, 1992 లో ఆపద్బాందవుడు వంటి క్లాసిక్ మూవీ విశ్వనాద్ గారి దర్సకత్వం లో చేయటమే కాకుండా ప్రజల మెప్పుని కూడా పొందారు. ఆ సినిమా ద్వారా చిరంజీవి కి ఉత్తమ నటుడి గా నంది పురస్కారం లబించింది . వెంకటేష్ : 1991 లో కూలీ నంబర్ 1 , సూర్యా ఐపియస్ క్షణక్షణం హిట్ ల తర్వాత 1992 లో చంటి అనే తమిళ్ రీమేక్ ద్వారా ప్రేక్షకులను మెప్పించాడు వెంకటేష్. రవి రాజా పినిశెట్టి దర్శకత్వం లో వచ్చిన ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. ఆ రోజుల్లో 100 డేస్ 40 థియేటర్లలో ఆ సినిమా ఆడింది. నాగార్జున : 1996 లో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా హిట్ తర్వాత 1997 లో అన్నమయ్య అనే భక్తి రస చిత్రం త