సినిమాల్లో, కొంత మంది హీరో హీరోయిన్ల కి హిట్ జంట గా పేరు సంపాదిస్తారు. అలాంటి జంటల్లో ఒక జంట వెంకటేశ్ మీనా. వీరిద్దరు కలిసి 5 సినిమాలు చేసారు, ఆ ఐదు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.
1992 లో వచ్చిన చంటి సినిమా వీళ్ళీద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి హిట్ సినిమా. ఈ సినిమా తో వీరి విజయ పరంపర కొనసాగింది. తమిళం లో విజయం సాదించిన ఈ సినిమా ను తెలుగు లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు 4 నంది అవార్డ్లు రావటం గర్వించదగ్గ విషయం. ఈ సినిమాను హిందీ లో అనారీ అనే పేరు తో వెంకటేశ్ ను హీరో గా పెట్టి తీసారు.
అదే 1992 సంవత్సరం లో నే ఇంకొక సినిమా సుందరకాండ సినిమా కూడా రిలీజ్ అయ్యి ఘన విజయం సాదించింది. ఈ సినిమా కూడా తమిళం లో విజయం సాధించిన సినిమాకు రీమేక్. ఈ సినిమా కు రాఘవెంద్ర రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కూడా హిందీ లో అందాజ్ అనే పేరు తో తీసారు. ఈ సినిమాలో అనిల్ కపూర్ హీరో గా చేసారు.
1993 లో వచ్చిన మరో హిట్ అబ్బాయి గారు. ఈ సినిమా కూడా తమిళం లో హిట్ అయిన సినిమా ను రీమేక్ చేసారు. ఈ సినిమా తెలుగు లో తీసే ముందే హిందీ లో రీమేక్ చేసారు. హిందీ లో బేటా అనే పేరు తో తీసి రిలీజ్ చేసారు. అబ్బాయి గారు కూడా ఘన విజయం సాదించింది.
తర్వాత 5 సంవత్సారాల గ్యాప్ తర్వాత మళ్ళి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సూర్య వంశం. ఈ సినిమా కూడా తమిలం నుంచి రీమేక్ చేసిందే. ఈ సినిమాను కూడా హింది లో అమితాబ్ ను హీరో గా పెట్టి రీమేక్ చేసారు. ఈ సినిమా కు భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు.
ఇక 2014 లో వచ్చిన ద్రుష్యం, 2021 లో సీక్వెల్ గా వచ్చిన ద్రుష్యం 2 సినిమా లో కూడా మీనా నే హీరోయిన్ గా చేసింది, ఈ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమా మలయాళం లో హిట్ అయిన ద్రుష్యం ను రీమేక్ చేసారు.
ఈ సినిమాను కూడా హిందీ లో కి రీమేక్ చేసారు.
వెంకటేశ్ మీనా జంటగా వచ్చిన అన్ని సినిమాలూ, వేరే భాష లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసినవే.
హిట్ అయిన అన్ని సినిమాలు, హింది లో రీమేక్ చేసారు
అన్ని సినిమాలు మ్యూసికల్ గా హిట్ అయినవే
Comments
Post a Comment