Skip to main content

Posts

Showing posts from February, 2022

ఫ్లాప్స్ లేని హిట్ జంట వెంకటేశ్ మీనా - Venkatesh and Meena a hit pair

 సినిమాల్లో, కొంత మంది హీరో హీరోయిన్ల కి హిట్ జంట గా పేరు సంపాదిస్తారు. అలాంటి జంటల్లో ఒక జంట వెంకటేశ్ మీనా. వీరిద్దరు కలిసి 5 సినిమాలు చేసారు, ఆ ఐదు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.  1992 లో వచ్చిన చంటి సినిమా వీళ్ళీద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి హిట్ సినిమా. ఈ సినిమా తో వీరి విజయ పరంపర కొనసాగింది. తమిళం లో విజయం సాదించిన ఈ సినిమా ను తెలుగు లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు 4 నంది అవార్డ్లు రావటం గర్వించదగ్గ విషయం. ఈ సినిమాను హిందీ లో అనారీ అనే పేరు తో వెంకటేశ్ ను హీరో గా పెట్టి తీసారు.  అదే 1992 సంవత్సరం లో నే ఇంకొక సినిమా సుందరకాండ సినిమా కూడా రిలీజ్ అయ్యి ఘన విజయం సాదించింది.  ఈ సినిమా కూడా తమిళం లో విజయం సాధించిన సినిమాకు రీమేక్. ఈ సినిమా కు రాఘవెంద్ర రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కూడా హిందీ లో అందాజ్ అనే పేరు తో తీసారు. ఈ సినిమాలో అనిల్ కపూర్ హీరో గా చేసారు. 1993 లో వచ్చిన మరో హిట్ అబ్బాయి గారు. ఈ సినిమా కూడా తమిళం లో హిట్ అయిన సినిమా ను రీమేక్ చేసారు. ఈ సినిమా తెలుగు లో తీసే ముందే హిందీ లో రీమేక్ చేసారు. హిందీ లో బ...