మొన్న ఎపిసోడ్ లో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్టు చెప్పి, తర్వాత నోయల్ కోరిక మేరకు ఎలిమినేషన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం ప్రేక్షకులు తమ ఓట్లకు విలువ లేదని భావించారు.
అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ సేవ్ అవ్వడమే కాకుండా అథ్యదిక ఓట్లు వచ్చినట్టు ప్రకటించి కెప్టన్ పోటీదారుడు అనడం ప్రేక్షకులకు వింత గా అనిపించింది.
ఎలిమినేట్ అయ్యాడు అంటేనే ఓట్లు తక్కువ అని అర్దం. అందర్నీ సేవ్ చేసి, మెహ్ బూబ్ ని అమ్మ రాజశేఖర్ ని కన్సెస్సన్ రూం కి పిలిచి మెహ్ బూబ్ సేఫ్ అని చెప్పి అమ్మ ఎలిమినేట్ అయ్యాడు అంటే అమ్మ రాజ సేఖర్ కు ఓట్లు తక్కువ అని అర్దం.మరి అత్యదిక ఓట్లు రాకపోయినా కెప్టన్ పోటీ దారిడి గా ఎలా ఎంపిక అయ్యడో.
ఒక వారం అంతా ప్రేక్షకులు బిగ్ బాస్ షో ను వీక్షించి ఎంతో కష్టపడి ఓట్లు వేసి, మిస్ద్ కాల్స్ ఇచ్చి ఎలిమినేట్ అవ్వాలసిన కంటెస్టెంట్ ని ఎంపిక చేస్తే , నోయల్ కోరిక తీర్చడం కోసం ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తే ఇక ప్రేక్షకుల ఓట్లకి విలువ ఎక్కడ ఇచ్చినట్టు.
మరి ఈ లెక్కన వచ్చే వారం ఇద్దరిని ఎలిమినేట్ ఛెస్తారా?
బిగ్ బాస్ ప్రేక్షకుల ఓట్లకి విలువ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పటికే చాలా సార్లు ఈ సీజన్ లో అన్ని ఎలిమినేషన్ లు పక్షపాత దోరణి లో సాగుతోందని ప్రేక్షకుల అభిప్రాయం. ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయటం అగ్ని లో ఆజ్యం పోసినట్టు అయ్యింది.
ఎది ఎమైనా బిగ్ బాస్ ప్రేక్షకుల ఓట్ల కి విలువిచ్చి వీక్ అని ప్రేక్షకులు భావించిన కంటెస్టెంట్ లను ఎలిమినేట్ చేస్తే షో ఇంకాస్త ఇంటరెస్టింగ్ గా ఉంటుంది.
Comments
Post a Comment