తరుణ్ బాల నటుడు గా మాత్రమే కాకుండా హీరో గా కూడా సినిమాలు చేసి పేరు సంపాదించుకున్నాడు.
బాల నటుడు గా అంజలి, ఆదిత్య 369, మనసు మమత, తేజా వంటి సినిమాలు చేసి, కొన్ని అవార్డులు కూడా సాదించాడు.
రోజా రమణి కొడుకు గా వెండి తెర కి పరిచయం అయ్యి తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
2000 లో వచ్చిన నువ్వే కావాలి తో హీరో గా పరిచయం అయ్యి ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు.
ఆ తర్వాత నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, భలే దొంగలు, శశి రేఖ పరిణయం, వంటి హిట్ సినిమాలు చేసాడు. ఆ తర్వాత చాలా సినిమాలు ఫ్లాప్ కావటం తో అడపా దడపా ఎవో సినిమాలు చేస్తున్నా, ప్రేక్షకుల కి సరిగా చేరటం లేదు.
రవి బాబు డైరక్ట్ చేసిన సోగ్గాడు పరవాలేదనిపించిన అంత సక్సెస్ కాలేదు. ఈ సోగ్గాడు సినిమాను అప్పట్లో మంచి హిట్ సినిమలు చేస్తున్న ఉదయ్ కిరణ్, తరుణ్ తో కలిపి తీయాలని, రవి బాబు ఆలోచన. కాని ఉదయ్ కిరన్ ఒప్పుకోకపోవటం తో, ఇంకొక వేరే హింది యాక్టర్ ని పెట్టి తీసాను అని పలు ఇంటర్వ్యూలలో రవి బాబు తెలిపారు. ఆ సినిమా సక్సెస్ కాకపోవటానికి అదొక కారణం అని కూడా తెలిపారు.
ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తరుణ్ మాట్లాడుతూ, చేస్తే హీరో గానే చేస్తానని, సైడ్ క్యారక్టెర్స్ చేయనని తెలిపారు.
అల వైకుంఠపురం లో సినిమాలో సుషాంత్ పాత్ర ముందుగా తరుణ్ దగ్గరకు వచ్చిందని, కాని తరుణ్ హీరో పాత్రలు తప్ప వేరే పాత్రలు చేయనని చెప్పి రిజక్ట్ చేసాడు.
ఇప్పుడున్న పరిస్తితుల్లో హీరో అంటే మంచి సబ్జక్ట్ తో ఉన్న సినిమా చేసి నిరూపించుకోవాలసిందే.
Comments
Post a Comment