బాలక్రిష్ణ కు ప్రేక్షకులలో మంచి మాస్ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ను 1990 ల లోనే ఒక స్తాయి కి తీసికెళ్ళిన దర్శకుడు బి గోపాల్. ఆయన దర్శకత్వం లో బాలక్రిష్ణ హీరో గా వచ్చిన 5 సినిమాలలో 4 సినిమాలు బ్లాక్ బస్టర్ల గా నిలిచాయి .
లారీ డ్రైవర్
బి గోపాల్ దర్శకత్వం లో బాలక్రిష్ణ చేసిన మొదటి సినిమా లారీ డ్రైవర్. 1990 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది . ఈ సినిమా లో బాలక్రిష్ణ కు జంటగా విజయశాంతి నటించింది . ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు . ఈ సినిమా తో బాలక్రిష్ణ కు అప్పటిదాకా ఉన్నా మాస్ ఇమేజ్ రెట్టింపు అయ్యింది .
రౌడీ ఇన్స్పెక్టర్
బి గోపాల్ దర్సకత్వం లో బాలక్రిష్ణ హీరో గా వచ్చిన రెండవ సినిమా . ఈ సినిమా 1992 లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది . ఈ సినిమా కి బప్పీ లహరి సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలు అప్పట్లో ఏ ఆటో ఎక్కినా వినిపించేవి.ఈ సినిమాలో బాలక్రిష్ణ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో నటించారు .
సమరసింహా రెడ్డి
1992 తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో 1999 లో వచ్చిన చిత్రం సమర సింహా రెడ్డి . ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ లో ఉన్న్న రికార్డులన్ని తిరగ రాసింది. ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ముడి పడి ఉంటుంది.ఈ సినిమాలో అంజలా ఝవేరి, సంఘవి, సిమ్రాన్ హీరోయిన్లు గా నటించారు.
ఈ సినిమాకు మణి శర్మ సంగీతాన్ని అందించారు .ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్లగా నిలిచాయి. ఈ సినిమా 3 థియేటర్లలో 227 రోజులు ప్రదర్శింపబడింది. ఒక థియేటర్ లో ఒక సంవత్సరం పాటు ప్రదర్శింపబడింది . ఆరు కోట్లు ఖర్చు చేసి ఈ సినిమా తీస్తే 57 కోట్లు లాభాలని ఆర్జించింది .
నరసింహ నాయుడు
2000/2001 లో వచ్చిన ఈ సినిమా 105 థియేటర్ల లో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఈ సినిమా వలన నిర్మాత కు 52 కోట్ల లాభం వచ్చింది . ఈ సినిమా లో బాలక్రిష్ణ కు జంటగా
సిమ్రాన్, ఆషా శైని, ప్రీతి జింగానియా నటించారు .
ఈ సినిమాకు మణి శర్మ సంగీతాన్ని అందించారు .ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్లగా నిలిచాయి. ఈ సినిమా బాలక్రిష్ణ కు ఉత్తమ నటుడు నంది అవార్డ్ తెచ్చిపెట్టింది .
Comments
Post a Comment